మిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'జైలర్'. సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో రజనీకాంత్ కి జోడిగా తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ అతిథి పాత్రల్ల్లో కనిపించనున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 10న తమిళం తో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది.


ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.." సినిమాలో రజనీకాంత్ ఓ జైలుకి వార్డెన్ గా కనిపిస్తారట. ఆయన వార్డెన్ గా ఉంటున్న జైలుని ఓ విలన్ గ్యాంగ్ బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ జైలులో ఆ గ్యాంగ్ సంబంధించిన లీడర్ ఉంటారు. జైల్లో ఉన్న మిగతా స్టాఫ్ ఆ సమస్యను ఎదుర్కోలేక చేతులెత్తేస్తారు. అప్పుడు జైలుకి వార్డెన్ గా ఉన్న రజనీకాంత్ ఒక్కడే ఆ గ్యాంగ్ నుంచి జైలు ని కాపాడుతూ ఆ గ్యాంగ్ వాళ్ళ నాయకుడిని జైలు నుంచి వెళ్లనివ్వకుండా చేస్తాడని, ఇది సింగిల్ ఎజెండాతో సాగే కథనమని" సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అంతేకాదు జైలులో ఉండే విభిన్న పాత్రలతో రజినీకాంత్ చేసే ఫన్ అండ్ యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటాయని, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాలో వింటేజ్ రజినిని గుర్తు చేసేలా సినిమాని తెరకెక్కించినట్లు చెబుతున్నారు.


దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా దర్శకుడు నెల్సన్ గత చిత్రం 'బీస్ట్' కూడా ఇలాంటి కథా, కథనాలతోనే ఉంటుంది. 'బీస్ట్' మూవీలో కొంతమంది టెర్రరిస్టులు ఓ షాపింగ్ మాల్ ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. జైల్లో ఉన్న తమ లీడర్ ని రిలీజ్ చేయకపోతే షాపింగ్ మాల్ లో ఉన్న అందరిని చంపేస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు. అలాంటి సమయంలో షాపింగ్ మాల్ లో ఉన్న హీరో విజయ్ టెర్రరిస్టుల నుండి అందరిని ఎలా రక్షిస్తాడనే పాయింట్ తోనే సినిమా సాగుతోంది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.


మరోసారి ఇప్పుడు అలాంటి కథనంతోనే రజనీకాంత్ తో 'జైలర్' సినిమాని తెరకెక్కించారు నెల్సన్ దిలీప్ కుమార్. ఈసారి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. మరోవైపు గత కొంతకాలంగా రజినీకాంత్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాయి. గతంలో ఆయన నటించిన 'కాలా', 'పేట', 'దర్బార్', 'అన్నాత్తే' సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలతో తెలుగులో అయితే రజనీకాంత్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దాంతో రజనీకాంత్ ఆశలన్నీ ప్రస్తుతం 'జైలర్' పైనే ఉన్నాయి.


Also Read : జీవిత, రాజశేఖర్‌‌లకు జైలుశిక్ష - చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పరువునష్టం కేసులో కీలక తీర్పు!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial