Top 5 Telugu Headlines Today 16 August 2023:
బెజవాడ మూడు స్థానాల్లో అభ్యర్థులు ఈ ముగ్గురే - ధ్రువీకరించేసిన సజ్జల
ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నగరం అత్యంత కీలకమయిన నగరం.. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఇప్పుడు రెండు స్దానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. మూడో నియోజకవర్గం అయిన తూర్పు నియోజకవర్గంలో తెలుగు దేశం శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న వారికి సీట్లు ఇస్తామని వారిని గెలిపించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటనతో విజయవాడ లోని మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు
సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా, కారణం ఏంటంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన కారణంగా సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి ఈనెల 19వ తేదీన మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. వాతావరణ శాఖ అధికారుల సూచనలతో వాయిదా వేశారు. ఈక్రమంలోనే ఈనెల 19కి బదులుగా ఇదే నెల 23వ తేదీన పర్యటించబోతున్నట్లు సమాచారం. ఆరోజే మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు
వంగవీటి రాధా పెళ్లి డేట్ ఫిక్స్ - త్వరలోనే ఎంగేజ్‌మెంట్, అమ్మాయి ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత అయిన వంగవీటి రాధా కృష్ణ.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారు. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా కృష్ణా వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలియడం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. వంగవీటి రాధా కృష్ణా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. నర్సాపుం పట్టణానికి చెందిన ఓ యువతితో రాధా కృష్ణకు వివాహం ఖాయం అయినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధా కృష్ణ మిత్రుడికి దగ్గరి బంధువుల అమ్మాయినే రాధా పెళ్లి చేసుకోబోతున్నారని, ఈ మేరకు నిశ్చయం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు
రేవంత్ వర్సెస్ పోలీసులు - తెలంగాణ వ్యాప్తంగా కేసులు నమోదు
రేవంత్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు జిల్లాల్లో పోలీసు అధికారుల సంఘాలు ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నాయి. దీంతో పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నేతలు కూడా పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. పూర్తి వివరాలు
మెగాస్టార్ చిరు మోకాలికి స్వల్ప శస్త్రచికిత్స - ఢిల్లీ ఆసుపత్రిలో అడ్మిట్
ప్రముఖ సినీ నటుడు, హీరో మెగాస్టార్ చిరంజీవి మోకాలికి స్వల్ప శస్త్ర చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో అడ్మిట్ కాగా... శస్త్ర చికిస్త చేసినట్లు సమాచారం. మోకాలిలో తరచుగా నొప్పి వస్తుండడంతో పరీక్షలు చేయించుకోగా... ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఈక్మరంలోనే ఎలాంటి కోత లేకుండా ఆర్థ్రోస్కోపిక్ విధానంలో ఇన్ఫెక్షన్ను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి ప్రస్తుతం ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటుంటున్నారట. మరో నాలుగు, ఐదు రోజుల్లో హైదరాబాద్ కు తిరిగి రానున్నట్లు ఆయన పీఆర్ బృందం వెల్లడించింది. పూర్తి వివరాలు