Stock Market @12 PM, 16 August 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం ఒడుదొడుకుల మధ్య సాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 35 పాయింట్లు తగ్గి 19,399 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 71 పాయింట్లు తగ్గి 65,330 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగింది. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మళ్లీ పుంజుకున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,401 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,238 వద్ద మొదలైంది. 65,032 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,370 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 71 పాయింట్ల నష్టంతో 65,330 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,434 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ బుధవారం 19,369 వద్ద ఓపెనైంది. 19,317 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,407 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 35 పాయింట్లు తగ్గి 19,399 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,726 వద్ద మొదలైంది. 43,600 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,905 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 233 పాయింట్లు తగ్గి 43,857 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, ఇన్ఫీ, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, విప్రో షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, హీరో మోటో షేర్లు నష్టపోయాయి. ఐటీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్ ఎక్కువ నష్టపోయాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.59,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.200 పెరిగి రూ.73000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.23,870 వద్ద ఉంది.
Also Read: తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివైన మార్గం ఇది!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.