3 Year Fixed Deposit Rates: గత వారంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్‌లో, రెపో రేటును పెంచకూడదని, 6.50% వద్దే కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ (RBI Repo Rate) నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తర్వాత దేశంలోని కొన్ని కమర్షియల్ బ్యాంక్‌లు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్లను తగ్గించాయి. అయితే, కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు ఇప్పటికీ మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
మీరు, లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ (స్వల్పకాలిక పెట్టుబడి) కోసం ఒక మంచి పెట్టుబడి మార్గం కోసం వెతుకుతుంటే, మూడేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం ఒక బెటర్ ఆప్షన్. మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBలు) మంచి వడ్డీ ఆదాయం చెల్లిస్తున్నాయి.
మూడేళ్ల FDపై 8 శాతం పైగా వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు:
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD ఇంట్రస్ట్ రేట్
889 రోజుల నుంచి 1095 రోజుల (3 సంవత్సరాలు) మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 8 శాతం వడ్డీ రేటును ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. అదే టైమ్ కోసం సీనియర్ సిటిజన్లు చేసే టర్మ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD ఇంట్రస్ట్ రేట్
1001 రోజుల నుంచి 1095 రోజుల (3 సంవత్సరాలు) మధ్య మెచ్యూర్ అయ్యే FDలకు 8 శాతం వడ్డీ రేటును ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అందిస్తోంది. అదే కాలవ్యవధిలో మెచ్యూర్ అయ్యే సీనియర్ సిటిజన్ FDలకు 8.6 శాతం వడ్డీ రేటు ఇస్తోంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD ఇంట్రస్ట్ రేట్
1000 రోజుల నుంచి 1500 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు, అదే కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.85 శాతం వరకు పెరుగుతుంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD ఇంట్రస్ట్ రేట్
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే FDలకు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ ప్రజలకు 8.6 శాతం వడ్డీ రేటు చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు, అదే టైమ్ పిరియడ్‌లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 9.1 శాతం వరకు వస్తుంది.
లోన్ రేట్ తగ్గించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, తాను ఇచ్చే గృహ రుణం, కారు రుణాలపై 20 బేసిస్ పాయింట్ల (0.20 శాతం) వరకు వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ రిడక్షన్ తర్వాత, ఇప్పుడు, BoM హోమ్ లోన్ 8.60 శాతం నుంచి 8.50 శాతం వడ్డీకి అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, కారు లోన్ 20 బేసిస్ పాయింట్లు తగ్గి 8.70 శాతానికి చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త రేట్లు సోమవారం (ఆగస్టు 14, 2023) నుంచి అమల్లోకి వచ్చాయి. లోన్ మీద ఇంట్రస్ట్ రేట్లను తగ్గించడం మాత్రమే కాదు, కొన్ని రకాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తేసింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఉడాన్ ప్రచారంలో భాగంగా... విద్యా రుణం (education loan), బంగారం రుణం (gold loan) వంటి ఇతర రిటైల్ స్కీమ్స్ మీద ప్రాసెసింగ్ ఫీజ్ మొత్తాన్ని మాఫీ చేసింది. ఈ రోజు నుంచి ఎవరైనా ఈ బ్యాంకు నుంచి విద్య, బంగారం వంటి రుణాలు తీసుకుంటే ఒక్క రూపాయి కూడా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
మరో ఆసక్తికర కథనం: ఇకపై బ్యాంక్ లోన్ చాలా త్వరగా వస్తుంది, కొత్త టెక్నాలజీతో వస్తున్న ఆర్‌బీఐ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial