Chiranjeevi Health: ప్రముఖ సినీ నటుడు, హీరో మెగాస్టార్ చిరంజీవి మోకాలికి స్వల్ప శస్త్ర చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో అడ్మిట్ కాగా... శస్త్ర చికిత్స చేసినట్లు సమాచారం. మోకాలిలో తరచుగా నొప్పి వస్తుండడంతో పరీక్షలు చేయించుకోగా... ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఎలాంటి కోత లేకుండా ఆర్థ్రోస్కోపిక్ విధానంలో ఇన్ఫెక్షన్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి ప్రస్తుతం ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటుంటున్నారట. మరో నాలుగు, ఐదు రోజుల్లో హైదరాబాద్ కు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడ్డ మెగా స్టార్ 2016లో కుడి, ఎడమ భుజాలకు కూడా ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు మోకాలి నొప్పి కారణంగా మరోసారి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
Chiranjeevi Health: మెగాస్టార్ చిరు మోకాలికి స్వల్ప శస్త్రచికిత్స - ఢిల్లీ ఆసుపత్రిలో అడ్మిట్
ABP Desam | Edited By: jyothi Updated at: 16 Aug 2023 05:10 PM (IST)
Chiranjeevi Health: హీరో మెగాస్టార్ చిరంజీవి మోకాల్సి స్వల్ప శస్త్ర చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఈ చికిత్స చేయించుకున్నట్లు సమాచారం.
మెగాస్టార్ చిరు మోకాలికి స్వల్ప శస్త్రచికిత్స - ఢిల్లీ ఆసుపత్రిలో అడ్మిట్