నెల్లూరు నేతల చేతులు కలిపారు కానీ మనసులు కాదు- కొలిక్కి రాని వర్గపోరు
నెల్లూరోళ్ల రాజకీయం మామూలుగా ఉండదు. పైకి సైలెంట్ గానే ఉన్నా.. లోలోపల ఎవరి రాజకీయాలు వారివి. నిన్న మొన్నటి వరకు భాయీ భాయీ అంటూ తిరిగినోళ్లు ఈరోజు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. పైకి చేయీ చేయీ కలిపినా లోపల వారి ఎత్తులు, పైఎత్తులు అర్థం చేసుకోవడం కష్టం. తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ మధ్య రాజకీయం కూడా ఇలాగే మారింది. 


అనిల్ కుమార్ యాదవ్ రెండుసార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచారు, జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. ఆయన గెలుపుకి రూప్ కుమార్ సపోర్ట్ కూడా కీలకం. ఆ విషయం అనిల్ కి కూడా తెలుసు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు రూప్ కుమార్ అందుబాటులో ఉంటారు. అనిల్ షాడోగా ఆయన చాలా వ్యవహారాలు చక్కబెట్టారు. కానీ ఎక్కడో వ్యవహారం తేడా కొట్టింది. అనిల్, రూప్ మధ్య గొడవ ముదిరింది. ఎంతగా అంటే.. రూప్ కొత్త ఆఫీస్ కూడా కట్టుకుంటున్నారు. రూప్ వర్గం అనిల్ దగ్గరకు వెళ్లడంలేదు. అప్పట్లో పార్టీలోనే ఉన్న కోటంరెడ్డితో కూడా రూప్ సన్నిహితంగా ఉన్నారు కానీ, అనిల్ తో మాత్రం కలవలేదు. ఆ తర్వాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీనుంచి బయటకు రావడంతో రూప్, అనిల్ వ్యవహారంలో స్తబ్ధత నెలకొంది. కొన్నాళ్లు రూప్ కుమార్ సైలెంట్ గా ఉన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అమరావతి పిటిషన్లు విచారిస్తున్న ధర్మాసనం ముందుకు ఆర్ 5 జోన్ పిటిషన్లు - స్టే లేనట్లే !
అమరావతి రైతులు ఆర్‌- 5 జోన్‌పై దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను అమరావతి కేసులు విచారణ జరుపుతున్న ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని నిర్ణయించారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. జస్టిస్ రాజేక్ జస్టిస్ అభయ్ ల ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు వచ్చాయి. రాజధాని కేసులను వేరే బెంచ్ విచారిస్తున్నందున తాము వీటిని విచారించడం  సరి కాదని..  అమరావతి కేసుల్ని విచారిస్తున్న జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందు లిస్ట్ చేయాని రిజిస్ట్రార్ ను ధర్మాసన ఆదేశించింది. వచ్చే శుక్రవారంలోగా లిస్ట్ అయ్యేలా చూడాలన్నారు. అప్పటి వరకూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రైతుల తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. అయితే రాజధాని పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందునే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని ప్రభుత్వం తరపు న్యాయవాది  నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వంద రోజులు పూర్తి చేసుకున్న యువగళం, కుమారుడు లోకేష్‌తో కలిసి అడుగులేసిన తల్లి భువనేశ్వరి
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వందోరోజులు పూర్తి చేసుకుంది. యువగళం పాదయాత్రకు 100 రోజులతోపాటు 1200 కిలోమీటర్ల మైలురాయిని కూడా దాటబోతోంది. ప్రస్తుతం నంద్యాలలో ఉన్న పాదయాత్ర చేస్తున్నారు. అక్కడే వందరోజుల వేడుక నిర్వహించనున్నారు. 


జనవరి 27న లోకేష్ తన పాదయాత్ర కుప్పం నుంచి మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 34 నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగిందీ యాత్ర. మొత్తం 1269 కిలోమీటర్లు మేర నడిచారు లోకేష్‌.  ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ సాగుతున్నారు. యాత్రకు పోలీసులు, ప్రభుత్వం, అధికార పక్షం అనేక అడ్డంకులు సృష్టిస్తున్నా  వాటిన్నంటినీ అధిగమిస్తూ లోకేష్ తన యాత్రలో ముందుకు సాగుతున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. వివిధ సామాజిక వర్గాలను, కూలీలను, రైతులను, మహిళలను, యువతను ఇలా అనేక వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలకు పరిష్కారం చెబుతూ యాత్ర చేస్తున్నారని తెలిపారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


తెలంగాణలో ఆ 2 స్టేషన్లలో రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేయండి
ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో కొన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. యశ్వంత్ పూర్- హజరత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు మహబూబ్‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో ఆపేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరారు. ఆ రైలు కాచిగూడ నుంచి బయలుదేరి ఎక్కడా ఆగకుండా 200 కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు చేరుకుంటుందన్నారు. కానీ ఇంత దూరంలో కనీసం ఎక్కడా స్టాప్ లేదని, మహబూబ్ నగర్, షాద్ నగర్ లాంటి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగేలా చేయాలని కిషన్ రెడ్డి ప్రతిపాదించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఈ ప్రాంత వాసులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉందన్నారు.    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి   


ఉద్యోగాల సృష్టిలో హైదరాబాద్ కింగ్ - ఫాక్స్ కాన్‌కు కేటీఆర్ భూమి పూజ !
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌  టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌  భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ.1,656  కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ ఇక్కడ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తోంది.  ఇందులో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వ  వర్గాలు చెబుతున్నాయి.
ఫాక్స్‌కాన్‌కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ఫాక్స్‌కాన్‌ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫాక్స్ కాన్   పెట్టుబడి పెట్టడానికి తెలంగాణను ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు. భారత్​లో క్రియేట్​ అయ్యే ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే క్రియేట్ అవుతోందన్నారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి