Amaravathi Supreme Court : అమరావతి రైతులు ఆర్- 5 జోన్‌పై దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను అమరావతి కేసులు విచారణ జరుపుతున్న ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని నిర్ణయించారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. జస్టిస్ రాజేక్ జస్టిస్ అభయ్ ల ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు వచ్చాయి. రాజధాని కేసులను వేరే బెంచ్ విచారిస్తున్నందున తాము వీటిని విచారించడం సరి కాదని.. అమరావతి కేసుల్ని విచారిస్తున్న జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందు లిస్ట్ చేయాని రిజిస్ట్రార్ ను ధర్మాసన ఆదేశించింది. వచ్చే శుక్రవారంలోగా లిస్ట్ అయ్యేలా చూడాలన్నారు. అప్పటి వరకూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రైతుల తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. అయితే రాజధాని పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందునే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని ప్రభుత్వం తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది.
అసలు ఆర్ 5 జోన్ వివాదం ఏమిటంటే ?
ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌లో కూడా ఈ మేరకు మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇచ్చింది. దీనిపై కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. అంతకు ముందే ప్రభుత్వ చర్యలను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలకు, చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వెళ్లటం తగదని, ఈ రకమైన చర్యలు చెల్లవని పేర్కొంది.
సీఆర్డీఏ చట్టం మార్చేసి ఆర్ 5 జో న్ఏ ర్పాటు చేసిన ప్రభుత్వం
ఈ ఉత్తర్వులు చెల్లవంటున్నరైతులు
సీఆర్డీఏ చట్టంలో ఎలాంటిమార్పులు చేయకూడదన్న కోర్టు తీర్పు ఉన్నా సీఆర్‌డీఏ చట్టంలో సవరణలు చేసింది ప్రభుత్వం. ఈ సవరణల ప్రకారం రెండు అధికారాలు సీఆర్‌డీఏకు, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. రాజధానిలో పేదలకు ఇళ్ల పేరుతో స్థలాలు ఇవ్వడంతో పాటు రాజధాని భూములను టౌన్‌షిప్‌ల పేరుతో అమ్ముకోవటానికి, బదలాయించటానికి అధికారాలు సంక్రమిస్తాయి. అయితే దీనిపనా కోర్టులో పిటిషన్లు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్5 జోన్ ఉత్తర్వులు చెల్లవని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు.