Top Headlines In Ap And Telangana:
1. పారిశ్రామికవేత్త రతన్ టాటాకు తెలుగు ప్రముఖుల నివాళి
ప్రముఖ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఒక గొప్ప వ్యక్తిని దేశం కోల్పోయిందన్నారు. రతన్ టాటా నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీకగా నిలిచారని గుర్తు చేశారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా రతన్ టాటా ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు రేవంత్. ఇంకా చదవండి.
2. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతితో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన అంత్యక్రియను కేంద్రం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గురువారం రోజును సంతాప దినంగా ప్రకటించాయి. ప్రపంచస్థాయి వ్యాపార దిగ్గజంగా ఎదగడమే కాకుండా మానవతా వాదిగా దేశానికి సేవ చేసిన రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఆయన సేవలకు సరైన గుర్తింపు ఇదేనంటూ మహారాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. ఇంకా చదవండి.
3. నారా కుటుంబంలో పెళ్లి సందడి
నటుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరుడి కుమారుడు నారా రోహిత్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. తనతో కలిసి నటించిన ఓ సినిమాలోని హీరోయిన్ తో నారా రోహిత్ జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు కుటుంబాల ఆమోదంతో అక్టోబర్ 13వ తేదీన కుటంబసభ్యుల మధ్యనే నిశ్చితార్థం జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి.
4. ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు!
గుంటూరుకు చెందిన ఇద్దరు బీజేపీ నేతల వ్యవహారశైలి వైరల్ గా మారింది. వారిలో ఒకరు గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర వీడియో కాల్‌లో ఓ మహిళతో మాట్లాడారు. ఆ కాల్ రికార్డింగ్ సోషల్ మడియాలోకి వచ్చింది. అందులో మాట్లాడుతున్న మహిళతో ఇప్పుడు కట్టుకున్న చీరతోనే రా.. మందు కొడదాం అని ఆహ్వానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వనమా నరేంద్రతో మాట్లాడిన మహిళ గతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన మహిళ ఒకరేనని గుంటూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఆమె గతంలో వైసీపీలో ఉండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు. ఇంకా చదవండి.
5. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR).. మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) పరువు నష్టం దావా వేశారు. ఆయన తరఫు న్యాయవాది ఉమమహేశ్వరరావు నాంపల్లి ప్రత్యేక కోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యానించారని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా చదవండి.