Nara Rohit engagement will take place on 13th : నటుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరుడి కుమారుడు నారా రోహిత్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. తనతో కలిసి నటించిన ఓ సినిమాలోని హీరోయిన్ తో నారా రోహిత్ జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు కుటుంబాల ఆమోదంతో అక్టోబర్ పదమూడో తేదీన కుటంబసభ్యుల మధ్యనే నిశ్చితార్థం జరగనున్నట్లుగా తెలుస్తోంది.
బాణం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నారా రోహిత్
చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్. పదిహేనేళ్ల కిందట ఆయన బాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వరుసగా ఫ్లాపులు రావడంతో గ్యాస్ తీసుకోవాలనుకున్నారు. ఇటీవల ప్రతినిధి 2 సినిమా ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. తాజాగా సుందరకాండ అనే మరో సినిమా రెడీ అయింది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ కెరీర్‌లో ఇది 20వ చిత్రం.
'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
తనతో కలిసి నటించిన హీరోయిన్ తోనే పెళ్లి
నారా రోహిత్ వయస్సు 40 ఏళ్లు. కుటుంబ కారణాల వల్ల ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. ఈనెల 13న హైదరాబాద్‌లోనే జరగనున్న నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీస్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. నారావారి కుటుంబం నుంచి కానీ, నందమూరివారి కుటుంబం నుంచి కానీ అధికారికంగా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మొదటి సినిమా సినిమాలపై ఆసక్తితో ఉన్న నారా రోహిత్ న్యూయార్క్ లోని ఫిలిం అకాడమీ నుంచి నటనలో శిక్షణ పొందారు. లాస్ ఏంజిల్స్ లో ఫిలి మేకింగ్స్ కోర్సు కూడా పూర్తిచేశారు.
పెళ్లి సబంధం మాట్లాడింది చంద్రబాబు సతీమణి
నారా రోహిత్ పెళ్లి విషయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. నారా రోహిత్‌కు సరి జోడిగా భావించి కుటుంబాల పెద్దలతో మాట్లాడి ఒప్పించినట్లుగా చెబుతున్నారు. నారా రోహిత్ కు గిరీష్ అనే సోదరుడు కూడా ఉన్నారు. ఆయన కూడా ఇంకా అవివాహితునిగానే ఉన్నారు. రోహిత్ పెళ్లి తర్వాత గిరీష్‌కు కూడా వివాహం చేస్తారని చెబుతన్నారు. నారా రోహిత్ తనకు వంట చేయడం చాలా ఇష్టం అని.. బిర్యానీ చేయడంలో స్సెషలిస్టునని ఇంటర్యూల్లో చెబుతూంటారు.