Prasanth Varma's 1st Female Superhero Movie Mahakali: యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలి సినిమా తెరకెక్కిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను కనీవినీ ఎరుగని రీతిలో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత PVCU నుంచి మొత్తం 12 సూపర్ హీరోస్ సినిమాలు తెరకెక్కించనున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగంగానే మూడో సినిమాను అనౌన్స్ చేశారు. ‘మహాకాళి’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు.


ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్న లేడీ డైరెక్టర్


ఇక ‘మహాకాళి’ సినిమాను ఆర్‌కెడి స్టూడియోస్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆర్‌కె దుగ్గల్ సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకు మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, అక్విజిషన్ కంపెనీ అయిన ఆర్‌కెడి స్టూడియోస్‌  ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లేడీ డైరెక్టర్ పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.  ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కబోతున్న లేడీ సూపర్ హీరో మూవీ ‘మహాకాళి’ అని మేకర్స్ ప్రకటించారు.   


సినిమాపై అంచనాలు పెంచుతున్న టైటిల్ పోస్టర్


‘మహాకాళి సినిమా బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల అధారంగా తెరకెక్కబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో మహాకాళి అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక అమ్మాయి తన తలను పులి తలకు ప్రేమగా తాకుతున్నట్లు చూపించారు. బ్యాగ్రౌండ్ లో గుడిసెలు, జాయింట్ వీల్ మంటల్లో కాలిపోతున్నట్లు చూపించారు. అది చూసి జనాలు భయంతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదంతా ఓ జాతర దగ్గర జరుగుతున్నట్లు అర్థం అవుతోంది. బెంగాలీ ఫాంట్‌ లో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ మధ్యలో డైమండ్ లాంటి రూపాన్ని చూపించారు. ఈ పోస్టర్ సినిమాపై  ప్రేక్షకులలో ఆసక్తి కలిగిస్తోంది.  






వరుస సినిమాలతో జోష్ లో ప్రశాంత్ వర్మ 


ఈ సినిమాను త్రీడీలో తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను RKD స్టూడియోస్ బ్యానర్ లో రిజన్వాన్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. స్నేహ సమీర క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నాగేంద్ర తంగాలు ప్రొడక్షన్ డిజైనర్ గా బాధ్యతలను నిర్వహించనున్నారు. పబ్లిసిటీ డిజైన్స్ వ్యవహారాలను అనంత్ కంచెర్ల చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. అటు బాలయ్య నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ ఆ సినిమాను అనౌన్స్ చేశారు. ‘హనుమాన్’ తర్వాత వరుస సినిమాలతో జోష్ లో ఉన్నారు ప్రశాంత్ వర్మ.


Read Also: ‘వేట్టయాన్‘ రిలీజ్ అని హాలీడేస్ ఇచ్చిన కంపెనీలు.. అదీ తలైవా రేంజ్ అంటే!