Guntur BJP leaders : గుంటూరుకు చెందిన ఇద్దరు బీజేపీ నేతల వ్యవహారశైలి వైరల్ గా మారింది. వారిలో ఒకరు గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర వీడియో కాల్‌లో ఓ మహిళతో మాట్లాడారు. ఆ కాల్ రికార్డింగ్ సోషల్ మడియాలోకి వచ్చింది. అందులో మాట్లాడుతున్న మహిళతో ఇప్పుడు కట్టుకున్న చీరతోనే రా.. మందు కొడదాం అని ఆహ్వానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


నాడు అంబటితో మాట్లాడిన మహిళే నేడు వనమా నరేంద్రతో ముచ్చట్లు  ?                        


వనమా నరేంద్రతో మాట్లాడిన మహిళ గతంలో మాజీ మంత్రి  అంబటి రాంబాబుతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన మహిళ ఒకరేనని గుంటూరుజిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఆమె గతంలో వైసీపీలో ఉండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆమె గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడితోనే అలా మాట్లాడుతూ దొరికిపోయారు. కావాలని ఆమె ఇలా లీడర్లతో పరిచయాలు పెంచుకుని చొరవగా మాట్లాడేలా చనువు ఇస్తారని అంటున్నారు. ఆ తర్వాత వీడియోలు, ఆడియోలు రికార్డు చేసి లీక్  చేస్తారని అంటున్నారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో వనమా నరేంద్ర ఫోన్ స్విచ్చాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. 


నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?


మరో గుంటూరు ముఖ్య నేత నగ్న వీడియోపై హైకమాండ్‌కు ఫిర్యాదు                    


ఆయన వీడియో నేరుగా బయటకు రాగా.. బీజేపీలో మరో మఖ్య నేతగా ఉన్న అధికార ప్రతినిది ఒకరి నగ్న వీడియో కూడా వాట్సాపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై హైకమాండ్ కు  ఫిర్యాదులు వెళ్లడంతో ఈ రెండు ఘటనలపైనా అంతర్గత విచారణకు కొంత మంది నేతల్ని నియమించినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పార్టీ నేతలు .. హైకమాండ్‌కు ప్రాథమిక నివేదిక పంపారు. ఈ ఇద్దరు నేతలు పార్టీలో ఉన్న నేతలతోనే అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు.           


ఈవీఎంలతోనే బీజేపీ గెలుస్తోందని నిందిస్తున్న జగన్ - కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యే ప్రయత్నమేనా ?                


త్వరలో ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశం                             


భారతీయ జనతా పార్టీ నేతలు ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోవడం ఆ పార్టీలో సంచనలంగా మారింది. ఆ ఇద్దరు నేతలను పదవుల నుంచి తప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి బయటపడుతూండటంతో..  టీడీపీ, జనసేన పార్టీలకు కూడా ఇబ్బందికరంగా మారింది.