Aam Aadmi Party is not ready to continue with Congress : భారతీయ జనతా  పార్టీపై ఎంత అధికార వ్యతిరేకత ఉన్నా.. ఆ పార్టీని ఓడించడం కాంగ్రె్స పార్టీకి సాధ్యం కాదన్న అభిప్రాయం హర్యానా ఎన్నికల ఫలితాలతో  బయటపడింది. సర్వేలు, గెలిచేస్తామన్న అతి విశ్వాసంతో ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడింది. కొన్ని సీట్లు ఇవ్వడం కూడా నష్టమే అన్నట్లుగా వ్యవహరించడంతో మొదటికే మోసం వచ్చింది. జాతీయ స్థాయిలో కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీగా కొంత త్యాగం చేసినా ఎంతో లాభం వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ ను దూరం పెడుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ  పార్టీతో కలిసేది లేదని చెబుతోంది. 


ఆప్‌ను కలుపుకోకపోవడం హర్యనాలో ఓటమికి ఓ కారణం 


కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలవకపోవడం వల్ల ఇప్పుడు తాము ఢిల్లీలో కాంగ్రెస్ తో కలవాల్సిన అవసరమే లేదని ఆమ్ ఆద్మీ నిర్ణయానికి వచ్చింది. ఆప్ కూడా ఇండీ కూటమిలో భాగమే. పొత్తులు పెట్టుకోవాలని అనుకున్నా.. ఆప్ కు కొన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించంది. ఆప్ హర్యానా ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ రెండు శాతం ఓట్లు సాధించింది. ఆ రెండు శాతం ఓట్లే ఫలితాలను తారుమారు చేశాయి. ఆప్ తో పొత్తులు పెట్టుకుని ఉంటే.. విజయాకాశాలు ఉండేవన్న వాదన  రాజకీయ పరిశీలకుల్లో ఉంది. కౌంటింగ్ సరళి చూస్తే ఇది నిజమని ఎవరికైనా అర్థమవుతుంది. 


విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌


ఢిల్లీలో కాంగ్రెస్‌తో వద్దనుకుంటున్న  ఆప్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ సిద్ధమవుతోంది. ఇప్పుడు తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఎవరితోనూ కలిసే ప్రశ్నే లేదని చెబుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తులు పెట్టుకున్నాయి. కానీ బీజేపీ అన్ని సీట్లలోనూ విజయం సాధించింది. దాంతో పొత్తులు వర్కవుట్ కాలేదు. ప్రజలు స్వాగతించలేదని స్పష్టతకు వచ్చారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉంటంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు కేజ్రీవాలే సీఎం కావాలని కోరుకుంటాని ఆమ్ ఆద్మ పార్టీ భావిస్తోంది. అందుకే గతంలోలా ఈ సారి కూడా క్లీన్ స్వీప్ చేస్తామని..దానికి సానుభూతి కూడా పవర్ ఫుల్ గా పని చేస్తుందని అనుకుంటున్నారు . కాంగ్రెస్‌ను కలుపుకుంటే మొత్త మైనస్ అవుతుందని ఆందోళనలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ను కలుపుకునేందుకు ఆసక్తిగా లేరు. 


ఈవీఎంలతోనే కదా ఇప్పటి వరకూ గెలిచింది - జగన్‌కు ఏపీ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్


ఇండీ కూటమి ఐక్యతకు దెబ్బే 


కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ముఖాముఖి పోరులో ఎక్కడా గెలిచే పరిస్థితుల్లో లేకపోవడంతో తాము కాంగ్రెస్ ను ఎందుకు మోయాలన్న ఆలోచనలోకి ఇండీకూటమి పార్టీలు వస్తున్నాయి. హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ చేస్తున్న ఈవీఎంల వాదనకు పెద్దగా మద్దతు లభించడం లేదు. జగన్ వంటి బయట పార్టీలకు చెందిన వారు మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ కూటమి పార్టీలను కలుపుకోకపోవడం వల్లే సమస్యలు వచ్చాయని..ఆ పార్టీతో ఇక ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల సర్దుబాటు చేసుకోవాలంటే ఆలోచించుకోవాలని అనుకుంటున్నాయి. మొత్తంగా హర్యానాలో బీజేపీ చేసిన ఓ తప్పు వల్ల జాతీయ కూటమికే ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది.