Breaking News Telugu Live Updates : ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 05 Nov 2022 05:40 PM
ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

 ఆదిలాబాద్ జిల్లా నెరడిగోండ మండలం కుష్టి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఉన్న వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం కొల్హారి వద్ద ఉన్న స్టోన్ క్రషర్ మిషన్ నుంచి కంకర్ లోడు తీసుకెళుతున్న టిప్పర్ వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. టిప్పర్ వాహనం వంతెనపై నుండి కింద పడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్ హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ లో విషాదం, చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి 

హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్కారం చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. 

ప్రధాని మోదీ హెలికాప్టర్ లో రిషి కొండ చుట్టూ ఓ రౌండ్ వెయ్యాలి: అయ్యన్న పాత్రుడు

విశాఖ:- మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కామెంట్స్... 


ఋషికొండ సహా విశాఖలో జరుగుతున్న దోపిడీని నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రధానికి ఉంది....


ప్రధాని మోదీ హెలికాప్టర్ లో  రిషి కొండ చుట్టూ ఓ రౌండ్ వెయ్యాలి : అయ్యన్న పాత్రుడు


విశాఖ పర్యటనకు వస్తున్న మోడీకి ఇక్కడ పరిస్థితులను వివరించి చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకత్వం మీద ఉంది....


నన్ను, నా కుటుంబం పై దౌర్జన్యంగా తప్పుడు కేసులు పెట్టినప్పుడు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు....


ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగట్టాలనే నేను మాట్లాడుతున్నాను..

ప్రపంచంలోని నియంతల లక్షణాలు అన్నీ కలిపిన వ్యక్తి జగన్ - యనమల

విశాఖ:- యనమల రామకృష్ణుడు కామెంట్స్.... జగన్ కక్ష అంతా ప్రజాస్వామ్యం, ప్రజల మీదే..... ప్రపంచంలో ఉన్న నియంతలకు ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంటే..... ఆ లక్షణాలు అన్నీ కలిపిన వ్యక్తి జగన్.
జగన్ కు పరిపాలన రాదు...ఎకానమీ అంటే ఏంటో తెలియదు... 10లక్షల కోట్లు అప్పులు దిశగా ప్రభుత్వం వెళుతోంది....
సంవత్సరానికి లక్ష కోట్లు అప్పులు చెల్లించడానికే సరిపోతాయి... ప్రతీ నెలా అప్పులు తెచ్చినా....అభివృద్ధి కనిపించడం లేదు....
పెట్రోల్,డీజిల్ పై సబ్సిడీ ఇవ్వమని కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకో లేదు...
తూర్పు తీరంలో భూములు మొత్తం జగన్ కబ్జాలోకి వెళ్లిపోతున్నాయి....
శ్రీకాకుళం నుంచి కృష్ణపట్నం వరకు భూములు అన్నీ సీఎం బినామీలు తీసుకుంటున్నాయి... ఆధారాలతో సహా నిరూపించడంకు సిద్ధం.... డైరెక్ట్ బెనిఫిట్ స్కీం కింద నేరుగా నిధులు ప్రజలకు చేరితే పేదరికం ఎందుకు పెరుగుతోంది.... రాష్ట్రంలో విద్య,వైద్య రంగాలు దెబ్బతిన్నా యి....

కేసిఆర్ నైతికంగా ఓడిపోయారు, ప్రజల్లో పలచబడి పోయారు - ఈటల రాజేందర్.

ఈటలరాజేందర్ ప్రెస్ మీట్ @ బీజేపీ ఆఫీస్, నాంపల్లి.


కెసిఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. 


మునుగోడులో ఒడిపోతున్ను అని తెలిసి కెసిఆర్ పక్క దారి పట్టించే ప్రయత్నం. 


కేసిఆర్ నైతికంగా ఓడిపోయారు. ప్రజల్లో పలచబడి పోయారు.  - ఈటల రాజేందర్. 


దేశాన్ని కాపాడాలి ఆ భాధ్యత న్యాయవ్యవస్థ, ప్రజలు, యువత, మీడియా మీద ఉంది అంటూ కెసిఆర్ ముసలి కన్నీరు కాస్తున్నారు. 


ఆ బాధనే తెలంగాణ కూడా అనుభవిస్తుంది. కెసిఆర్ తెలంగాణను అపహస్యం చేశారు. 
మన గౌరవం మట్టిలో కలిపారు. కెసిఆర్ అసలు రూపం తెలంగాణ ప్రజలకు తెలిసింది. 
తెలంగాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడింది అని కెసిఆర్ మర్చిపోయి చక్రవర్తిలా రాజ్యం నడుపుతున్నారు. 


నలుగురు ఎమ్మెల్యేలు పరమపవిత్రులు, నిప్పు కనికులు ఎలా అవుతారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. 


   
2014 నుండి 2018 వరకు 25 మంది శాసన సభ్యులను చేర్చుకున్నారు. 


2018 లో 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా కూడా.. 
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఖతం పట్టించారు. 12 మంది ఎమ్మెల్యేలను కలుపుకున్నారు.. 


యాంటీ డిఫెక్షన్ చట్టంలో ఉన్న లొసుగులు అడ్డం పెట్టుకొని చేరికలకు తెరలేపింది కెసిఆర్. 


ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని కూర్చోబెట్టుకొని సంక్షేమ పథకాల చెక్కులను మంత్రులు అందిస్తున్నారు.
ఇది ప్రజాస్వామ్యం అపహస్య చెయ్యడం కాదా? 
పార్టీ మారిన వారికి మంత్రి పదవి ఇచ్చావు అంటే ఇదేం ప్రజాస్వామ్యం అంటారు. 

పవన్ సభకు అనుమతి ఇచ్చామనే అక్కసుతోనే కూల్చివేతలు

ఏపీ రాజకీయాలు హాట్ గా మారాయి.. మంగళగిరి,తాడేపల్లి మున్సిపాలిటి పరిదిలోని ఇప్పటం గ్రామంలో మున్సిపల్ అదికారులు రోడ్డ విస్తరణ కోసం నిర్మాణాలు తొలగింపు చర్యలు చేపట్టటం పై గ్రామస్దలు అభ్యంతరం చెబుతున్నారు.డ్రైన్లు కూడ నిర్మించిన తరువాత వాటి వినుక ఉన్న ఇళ్లను తొలగించటం ఎంటని ప్రశ్నిస్తున్నారు. పవన్ సభకు అనుమతి ఇచ్చామనే అక్కసుతోనే కూల్చివేతలు చేపట్టారని మండిపడుతున్నారు.

ఇప్పటం చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

ఇప్పటం గ్రామం చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. గ్రామంలో నడుస్తూ కూల్చివేసిన ప్రతి ఇంటిని పరిశీలిస్తూ బాధిత గ్రామస్తులతో మాట్లాడుతున్నారు.

సంగారెడ్డి: 58వ రోజు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర

సంగారెడ్డి: 58వ రోజు ప్రారంభమైన రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర


సంగారెడ్డి జిల్లాలోని చౌటకుర్ నైట్ హాల్ట్‌ నుంచి యాత్ర ప్రారంభం


చౌటకూర్, ఆందోల్, జోగిపేట్, అన్నసాగర్‌ మీదుగా కొనసాగనున్న భారత్ జోడో యాత్ర


అల్లాదుర్గ్ దగ్గర మెదక్ జిల్లాలోకి ప్రవేశించనున్న భారత్ జోడో యాత్ర


నేడు 25 కి.మీ మేర పాదయాత్ర చేయనున్న రాహుల్

Background

ఏపీలో వర్షాలు తగ్గుముఖం పడుతుండగా, తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడింది. అయితే నేడు సైతం ఏపీలో కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయిని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు మార్చుకుంటున్నాయి. బంగాళాఖాతంలో త్వరలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీతో యానాం, తమిళనాడులోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. తమిళనాడులో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.


నవంబర్ 8 న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. మరో మూడు రోజుల్లో ఏర్పడనునున్న ఈ అల్పపీడనం ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తుండగా, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. ఏడేళ్ల కిందటి వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. 2015 లో నెల్లూరులో 200 - 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఈ ఏడాది సైతం అంతే వర్షాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు, తిరుపతి జిల్లా ప్రజలను హెచ్చరించారు. 


తెలంగాణలో వాతావరణం ఇలా
రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్నటివరకు కొన్నిచోట్ల తేలికపాలి జల్లులు కురిశాయి. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నవంబర్ 8, 9 తేదీలలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు వర్షాలు కురవనున్నాయి. 


హైదరాబాద్ ను పాక్షికంగా మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. నగరంలో కొన్ని ఏరియాలలో తేలికపాటి వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య, తూర్పు దిశ నుంచి గంటకు 4 నుంచి 68కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ప్రస్తుత ఉపరితల ఆవర్తనం మనకు పల్నాడు నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉంది. ప్రస్తుతం పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా విస్తరిస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ నగరంలో వర్షాలున్నాయి. భారీ గాలుల కోస్తాంధ్ర వైపుగా కలవడం వలన ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో నేడు పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనంతో పాటు వస్తున్న ఉపరితల ఆవర్తనం కాస్త ఆలస్యంగా రావడం వలన రాత్రివేళ అధికంగా కురవనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చలి గాలులు వీచనున్నాయి. 
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
చెన్నైకి దగ్గరగా ఉన్న​తమిళనాడు సరిహద్దు భాగాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇంతవరకు కోస్తా ప్రాంతాల్లో విస్తరిస్తున్న వర్షాలు ఇక నెమ్మదిగా కడప జిల్లాలో తగ్గుముఖం పట్టి, అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి.  
. బాపట్ల జిల్లాలో కురిసే వర్షాలు విజయవాడ నగరం దక్షిణ భాగాలైన గుంటూరు జిల్లాలోని పలు భాగాల్లోకి వెళ్లనుంది. ఏడేళ్ల తరువాత ఆ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కానుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు దిశ మార్చుకుంటున్నాయి. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లోనూ వర్ష సూచన ఉంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.