World Bank funds for Amaravati:  ప్రజా రాజధాని అమరావతి  మరో ముందడుగు వేస్తోంది. అమరావతి సుస్థిర అభివృద్ధి ప్రాజెక్ట్‌కు భారీ సాయం అందింది. అమరావతి ప్రాజెక్టు ఆర్థిక సాయానికి ఇచ్చిన హామీ మేరకు.. ప్రపంచ బ్యాంక్ నిధులు విడుదల చేసింది. మొదటి విడతగా రు. 3535కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. ఈ మొత్తం ఇవాళ ఏపీ ఖాతాలకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), కేంద్ర ప్రభుత్వం, HUDCO సహా పలు సంస్థలు ఈ ప్రాజెక్ట్‌కు నిధులు సమకూర్చుతున్నాయి. ఈ నిధులతో అమరావతిని ఆధునిక, వాతావరణ-స్థిరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

వరల్డ్ బ్యాంక్ నుంచి ₹3,535 కోట్లువరల్డ్ బ్యాంక్ అమరావతి అభివృద్ధి కోసం ₹3,535 కోట్లను మొదటి విడతగా విడుదల చేసింది. ఈ నిధులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలకు జమ కానున్నాయి. అమరావతి ప్రాజెక్టు 6800కోట్ల ( $800 మిలియన్లు, ) . అందించేందుకు అక్టోబర్‌లో జరిగిన వరల్డ్ బ్యాంక్ గవర్నింగ్ బాడీ సమావేశంలోనే ఆమోదించారు.అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద, నగరం  మొదటి దశ అభివృద్ధికి వరల్డ్ బ్యాంక్ సహాయం అందిస్తుంది. ఈ కార్యక్రమం సంస్థలను బలోపేతం చేయడానికి, రాష్ట్రాన్ని గ్రోత్ సెంటర్‌గా , Inclusive సిటీగా నిర్మించడానికి, నివాసితులకు అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుంది.

 2050 నాటికి 35 లక్షల మంది జనాభాను సమకూర్చేందుకు 217 చదరపు కిలోమీటర్ల నగరం కోసం  ఏపీప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని...ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో సుమారు 1 లక్ష మంది నివసిస్తున్నారని ప్రపంచబ్యాంక్ తన నివేదికలో పొందుపరిచింది.  నగర రవాణా అవసరాలను ప్లాన్ చేయడానికి, నిర్వహించడానికి కొత్త ఏకీకృత మెట్రోపాలిటన్ రవాణా అథారిటీని స్థాపించడంలోనూ... నీటి సరఫరా, మురుగునీటి వంటి ప్రాథమిక సేవల కోసం ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పింది. 

అమరావతి నవీన నగర నమూనా

అమరావతి  నగరం కోసం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) వాతావరణ-స్థిరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. ఇందులో 320 కిలోమీటర్ల ఆర్టీరియల్ రోడ్ గ్రిడ్, కార్బన్ పుట్ ప్రింట్ తక్కవు ఉండే1,280 కిలోమీటర్ల నైబర్‌హుడ్ రోడ్లు, విద్యుత్ , టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ కోసం డక్ట్‌లు, నీటి సరఫరా, మురుగునీరు, వర్షపు నీటి డ్రైనేజీ కోసం నగరవ్యాప్త వ్యవస్థలు ఉంటాయి. భవిష్యత్ వరదల ప్రమాదాలను తట్టుకునేందుకు వరద నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తారు. ఇందులో ప్రకృతి ఆధారిత పరిష్కారాలు, 30 శాతం భూమిని ఖాళీ స్థలాలుగా రిజర్వ్ చేయడం, నీటి నిల్వ రిజర్వాయర్లు సృష్టించడం, బలమైన వరద రక్షణ మౌలిక సదుపాయాల నిర్మాణం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఉంటాయి.

కేవలం మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాకుండా.. వతి మాస్టర్ ప్లాన్‌లో నివాస ప్రాంతంలో 22 శాతం భూమి పేదల గృహ నిర్మాణం కోసం కేటాయించారని, మహిళలు, యువత నైపుణ్యానికి కూడా నిధులు వినియోగిస్తారని ప్రపంచబ్యాంక్ తెలిపింది. 

ADB రుణం ₹6,700 కోట్లుఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) కూడా అమరావతి కోసం ₹6,700 కోట్ల రుణాన్ని ఆమోదించింది. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ -ADB నుండి $788.8 మిలియన్ల రుణానికి అక్టోబర్‌లోనే ఆమోదం లభించింది.  మొదటి విడత త్వరలో అందుబాటులోకి రానుంది. 

కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి ప్రత్యేక సహాయంగా ₹1,400 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులు ప్రాజెక్ట్‌కు అదనపు ఊతం ఇవ్వనున్నాయి.

హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (HUDCO) అమరావతి కోసం ₹11,000 కోట్ల రుణాన్ని అందించేందుకు అనుమతి లేఖను ఇప్పటికే సమర్పించింది. ఈ రుణం నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

 జర్మన్ ఆర్థిక సంస్థ నుంచి ₹5,000 కోట్ల నిధులు కూడా అందే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై మరింత స్పష్టత కోసం అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది.