NTR As Chief Guest Of MAD Square Success Celebrations: యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' (MAD Square) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ జోష్‌తోనే మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు. ఈ మూవీలో హీరో నార్నే నితిన్ స్వయంగా ఎన్టీఆర్‌కు బావమరిది.
ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ (Naga Vamsi) సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించారు. 'నన్ను, నా మూవీస్‌ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్యూ తారక్ అన్న' అంటూ ట్వీట్ చేశారు. ఈ నెల 4న (శుక్రవారం) శిల్ప కళా వేదికలో 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుక జరగనుందని.. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు ప్రకటించారు.
Also Read: 'కాంతార 2' మూవీ వాయిదా అంటూ రూమర్స్ - ఒక్క వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన టీం
త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి..
ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదల కాగా.. తెలుగు రాష్ట్రాల్లోనే అదిరే ఓపెనింగ్స్ సాధించింది. తొలి 3 రోజుల్లోనే రూ.55 కోట్లు.. ఇప్పటివరకూ రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలిపింది. రానున్న రోజుల్లోనూ ఇదే జోష్ కొనసాగిస్తుందని.. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని టీం భావిస్తోంది.
2023లో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌కు సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' రూపొందింది. ఈ మూవీకి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. నార్నే నితిన్ (Narne Nithin), సంతోష్ శోభన్, రామ్ నితిన్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. సినిమాలో ప్రియాంక జువాల్కర్, సునీల్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, సత్యంరాజేశ్, మురళీధర్ గౌడ్‌లు కీలక పాత్రలు పోషించారు.
ఇటీవలే ఈ మూవీ గురించి సోషల్ మీడియా పోస్టులపై నిర్మాత నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను చంపొద్దంటూ కామెంట్ చేశారు. రివ్యూలు రాసే వారు తన సినిమా రివ్యూలు రాయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు ఎందుకు ప్రోత్సహించరని ప్రశ్నించారు. సీక్వెల్ కాబట్టి ఆడిందని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని.. ఇదేమీ బాహుబలి 2, పుష్ప 2 కాదని.. వారేమీ పెద్ద హీరోలు కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలని.. కలెక్షన్ల విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే క్లారిటీ ఇస్తానంటూ సవాల్ విసిరారు. ఈ కామెంట్స్ ఇటీవల వైరల్‌గా మారాయి.