Prakash Raj Comments About Pawan Kalyan: నటుడు ప్రకాష్‌రాజ్ (Prakash Raj) మరోసారి పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) కామెంట్స్ చేశారు. పవన్.. పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే ప్రజా సమస్యల గురించి మాట్లాడారని.. ఆ తర్వాత మర్చిపోయారంటూ సెటైర్లు వేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. నేషనల్ అవార్డ్స్, పాలిటిక్స్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

టైం వేస్ట్ చెయ్యొద్దంటూ..

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల గురించి మాట్లాడారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని ప్రకాష్ రాజ్ అన్నారు. రకరకాలుగా మాట్లాడడానికి ఇదేం సినిమా కాదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండి కూడా ప్రజల సమస్యలను పరిష్కరించకుండా టైం ఎందుకు వృథా చేస్తున్నారు? అని ప్రశ్నించారు. 'డెమొక్రసీలో అపోజిషన్ అనేది లేకుంటే ఎలా?, ప్రజల పక్షాన నిలబడి వారిని ఎవరు ప్రశ్నించాలి?' అంటూ నిలదీశారు.

అది చాలా సెన్సిటివ్ ఇష్యూ

తిరుపతి లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ తాజాగా స్పందించారు. సనాతన ధర్మానికి తాను వ్యతిరేకిని కాదన్నారు. 'ఇది చాలా సున్నితమైన అంశం. భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ జరిగితే బాధ్యులను వెంటనే శిక్షించాలి.' అని ప్రకాష్ రాజ్ కోరారు.

Also Read: 'సికిందర్' మూవీపై బాలీవుడ్ స్టార్స్ మౌనం - స్పందించిన కండల వీరుడు సల్మాన్ ఖాన్, తనకు సపోర్ట్ కావాలంటూ..

గతంలోనూ ఇలానే..

అయితే, పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ గతంలోనూ ప్రకాష్ రాజ్ చాలా కామెంట్స్ చేశారు. సనాతన ధర్మం, తిరుమల లడ్డూ కల్తీ వివాదం అంశాలపై పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియా, పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. ఇటీవలే తమిళులు, హిందీ భాషపై పవన్ కామెంట్స్‌ను సైతం ఎద్దేవా చేస్తూ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. గెలవక ముందు 'జనసేనాని' గెలిచిన తర్వాత 'భజన సేనాని' అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఆయనకు, నాకూ పర్సనల్‌గా ఎలాంటి శత్రుత్వం లేదని.. ఆయన అభిప్రాయాలు, విధానాలకే తాను వ్యతిరేకమని ప్రకాష్ రాజ్ చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో హిందీ భాషపై పవన్ చేసిన కామెంట్స్‌పైనా ప్రకాష్ రాజ్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దొద్దంటే ఇంకో భాషను ద్వేషించడం కాదని.. మా మాతృభాషను కాపాడుకోవడం అంటూ ట్వీట్ చేశారు. 'మీ హిందీ భాషను మా మీద రుద్దకండి', అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు.. స్వాభిమానంతో మా మాతృభాష, మా తల్లిని కాపాడుకోవడం, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి.. ప్లీజ్' అంటూ కౌంటర్ ఇచ్చారు.