Salman Khan About Support Of Bollywood Stars To Sikindar Movie: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సికిందర్' (Sikindar) మార్చి 30న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ విడుదలకు ముందు తర్వాత బాలీవుడ్ స్టార్స్ ఎవరూ మూవీ గురించి స్పందించలేదు. దీనిపై తాజాగా కండల వీరుడు సల్మాన్ మాట్లాడారు. 

'నాకూ సపోర్ట్ కావాలి'

సాధారణంగా సల్మాన్ తన తోటి స్టార్స్ సినిమా ప్రచారాల్లోనూ పాల్గొంటారు. అయితే, ఆయన సికిందర్ మూవీపై ఎవరూ మాట్లాడలేదు. సినిమా విడుదలకు ముందు ఆమిర్ ఖాన్ (Aamir Khan), సన్నీ డియోల్ (Sunny Deol) మాత్రమే మంచి విజయం సాధించాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. మూవీ రిలీజ్ తర్వాత కూడా ఎవరూ స్పందించలేదు. తోటి బాలీవుడ్ స్టార్స్ మౌనంపై సల్మాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.  తనకు కూడా మద్దతు కావాలని అన్నారు.

'బాలీవుడ్‌లోని స్టార్స్ అంతా బహుశా నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అనుకున్నారేమో.. అందుకే ఎవరూ స్పందించలేదు. కానీ ప్రతీ మనిషికి మద్దతు కావాలి. నాకూ సపోర్ట్ కావాలి.' అని చెప్పారు. 'సికిందర్' రిలీజ్‌కు ముందు దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో కలిపి ఆమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరూ తప్ప మిగిలిన స్టార్స్ ఎవరూ మూవీని ప్రమోట్ చేయలేదు.

Also Read: ముందూ వెనుకా చూసుకోలేదు.. గుడ్డిగా దూకేశారు.. ‘ఆదిత్య 369’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

డెడికేషన్ లేకుంటే స్టార్ అయ్యేవాడినా..

తనకు వర్క్ పట్ల నిబద్ధత లేదంటూ వచ్చిన కథనాలపై సల్మాన్ స్పందించారు. సినిమాకు సంబంధించిన ప్రతీ విషయంలోనూ భాగం అవుతానని అన్నారు. తనకు డెడికేషన్ లేకుంటే ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడిని కాదని తెలిపారు.

సికిందర్ మూవీలో సల్మాన్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. మూవీలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషించగా.. ప్రముఖ నటుడు సత్యరాజ్ నెగిటివ్ రోల్‌లో నటించారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్టోరీ ఏంటంటే?

రాజ్ కోట్ సంస్థాన వారసులు సంజయ్ (సల్మాన్ ఖాన్) అంటే ప్రజలకు ఎక్కడా లేని అభిమానం. ఆయన ఓసారి ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఓ మహిళతో మహారాష్ట్ర మంత్రి కొడుకు ఓ మహిళతో తప్పుగా ప్రవర్తిస్తాడు. దీంతో అతన్ని కొడతాడు సంజయ్. ఈ విషయం తెలిసిన మంత్రి.. తన కొడుకుని కొట్టిన వాడి అంతు చూడాలని పోలీస్ ఆఫీసర్‌ను సంజయ్ ఇంటికి పంపిస్తాడు. పోలీస్ సంజయ్ ఇంటికి వెళ్లగా అతని వాహనాన్ని ధ్వంసం చేస్తారు అక్కడి ప్రజలు. 

దీంతో సంజయ్‌ను దొంగ దెబ్బ తీయాలని టెర్రర్ దాడిలో ఇరికించేందుకు యత్నిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది. తన భార్య ఆర్గాన్స్‌ను ఎందుకు డొనేట్ చేశారు? సంజయ్ భార్య మరణానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఆ ఓటీటీలోకి..

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకున్నట్లు తెలుస్తుండగా.. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.