సంక్రాంతి సందడి పల్లెటూళ్లలోనే కానీ పట్టణాల్లో పెద్దగా కనిపించదు. దాదాపుగా జిల్లా కేంద్రాల్లో కూడా అదే పరిస్థితి. పండగకు అందరూ కుటుంబ సమేతంగా సొంత ఊళ్లకు వెళ్లిపోతే, పట్టణాలన్నీ బోసిపోతాయి. బోగిమంటలు, హరిదాసులు, ధాన్యపు రాసులు, గొబ్బెమ్మలు.. వీటన్నిటినీ ఈ తరానికి ముఖ్యంగా, పట్టణాల్లో పెరిగే పిల్లలకు తెలియజేసేందుకు నెల్లూరులోని ఎంజీబీ మాల్ వినూత్న ప్రయోగం చేపట్టింది. మాల్ ఆవరణలో సంక్రాంతి పల్లె వాతావరణాన్ని సృష్టించింది. పూరి పాక, ధాన్యపు బస్తాలు, రోలు, రోకలి, అందమైన రంగవల్లులు.. ఇలా అన్నిట్నీ ఒకేచోట చేర్చి ఆకట్టుకుంటోంది. మాల్‌కి వచ్చే సందర్శకులంతా.. ఈ పల్లెటూరి వాతావరణానికి ముగ్ధులవుతున్నారు. ఫొటోలు, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.


Also Read: జాతకాలు తేల్చుకుందాం.. దమ్ముంటే ఓపెన్‌ డిబేట్‌కు రండి.. వైఎస్అర్‌సీపీ ఎమ్మెల్యేలకు తమ్మారెడ్డి సవాల్ !


తెలుగు సంప్రదాయాలను కొత్త తరానికి తెలియజేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నారు మాల్ నిర్వాహకులు. ప్రతి పండగకు వినూత్న ప్రయోగాలు చేస్తుంటామని, సంక్రాంతికి ఇలా సరికొత్తగా పల్లెటూరి సెట్టింగ్ వేశామని చెప్పారు.


సాధారణంగా పండుగలకు దాదాపు ప్రతి కుటుంబం సెలవులు తీసుకొని మరీ సొంతూరికి బయలుదేరుతుంది. కానీ, సెలవులు దొరకని, చిన్నసన్నకారు ఉద్యోగులు మాత్రం పండుగలతో సంబంధం లేకుండా విధుల్లోనే ఉండాల్సి వస్తుంది. సొంతూర్లు లేని వారు కూడా పండుగలను పట్టణాల్లోనే జరుపుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వారు పల్లెటూర్లలో ఉండే పండుగ సందడి మిస్ అవుతుంటారు. పండుగ వేళ సందడి కోసం చాలా మంది సినిమాలకో, షాపింగ్‌లకో, షాపింగ్ మాల్స్‌కో వెళ్తుంటారు. అక్కడ వారికి సంప్రదాయాలు చాటేలా షాపింగ్ మాల్ నిర్వహకులు వివిధ కళాకృతుల్లో సెట్టింగులు వేసి పండుగ వాతావరణం కల్పిస్తుంటారు. 


Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?


పండుగ అంటే ఫలానా ఆచారవ్యవహారాలు అని కూడా తెలియని నవతరం యువత.. మాల్స్‌లో అద్దాల అంగళ్ల మధ్యలో వేసిన పల్లెటూరి వాతావరన సెట్టింగ్స్ మధ్య నిలబడి అదే పనిగా ఫోటోలు దిగుతుంటారు. హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఉండే షాపింగ్ మాల్స్‌లో పండుగ సమయాల్లో ఇవే దృశ్యాలు కనబడుతుంటాయి.


Also Read: Mohan Babu University: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...


Also Read: Chiranjeevi: సీఎం జగన్‌తో చిరు లంచ్‌.. వ్యక్తిగతమా? లేదా చొరవ తీసుకుంటున్నారా?


Also Read: Vaikunta Ekadasi 2022: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి.. శ్రీవారి సేవలో పెద్దఎత్తున ప్రముఖులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి