Rains In Telanagana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. ఏపీలో గత రెండు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.
ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చిరు జల్లులు కురవనున్నాయి. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి), పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కొన్ని చోట్ల మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జనవరి 14 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సైతం వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరు కురవనున్నాయి. దీంతో ఈ జిల్లాలకు సైతం వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రాంతాల్లో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లోనూ మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రైతులు తమ ధాన్యం, పంట ఉత్పత్తులను నీటి పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఏపీలోని రాయలసీమలో నేడు తేలిక పాటి జల్లు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. జనవరి 14 వరకు రాయలసీమకు వర్ష సూచన ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సీమ ప్రాంతానికి ఎలాంటి అలర్ట్ జారీ కాలేదు. ఇక్కడ వర్షాల ప్రభావం అంతగా ఉండదని అంచనా వేశారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో గత మూడు రోజుల నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనవరి 14 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వర్షం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Also Read: Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి!
Also Read: Horoscope Today 12th January 2022: ఈ రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే... మీ రాశి ఫలితం
Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన