డెల్టా వేరియంట్‌తో పోలిస్తే కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. ఈ వేరియంట్‌ను అణిచివేసే పద్ధతులపై ఇప్పటికీ పలు అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ అతితక్కువ కాలంలోనే చాలా దేశాల్లో వ్యాప్తి చెందింది. కేసులు కూడా శరవేగంగా పెరిగాయి. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే టీకా ద్వారా అందే యాంటీ బాడీస్‌కు ఒమిక్రాన్ వైరస్ ఎలా ప్రతిస్పందిస్తాయి అనే దానిపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లోనే ఒమిక్రాన్ వైరస్‌ను తటస్థీకరించడానికి బూస్టర్ డోస్ అవసరం పడుతుందని తేల్చారు. 


ప్రయోగం ఇలా...
బెల్జియానికి చెందిన కేయూ లువెన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈజిప్టు నుంచి వచ్చిన మహిళ నుంచి నాసికా నమూనాలను సేకరించారు. ఆమె ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన మహిళ. ఆమె నుంచి సేకరించిన నమూనాల నుంచి ఒమిక్రాన్ వేరియంట్‌ను వేరు చేశారు. దానిపై ప్రయోగించేందుకు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తుల నుంచి యాంటీబాడీస్‌ను సేకరించారు. అలాగే గతంలో కరోనా వచ్చి తగ్గిన వారి నుంచి కూడా యాంటీ బాడీస్ ను సేకరించారు. వాటిని ఒమిక్రాన్ పై ప్రయోగించారు.  వైరాలజిస్టులు వైరస్ ఎవల్యూషన్, ప్రొటీన్ స్ట్రక్చర్‌ను విశ్లేషించారు. ఇమ్యూనిటీ యూనిట్ అభివృద్ధి చేసిన వేగవంతమైన న్యూట్రలైజేషన్ పరీక్షలను ఉపయోగించారు. 


ఇదీ ఫలితం
శాస్త్రవేత్తలు క్లినికల్ ప్రాక్టీస్‌లో తొమ్మిది మోనోక్లోనల్ యాంటీబాడీలను పరీక్షించారు. అందులో ఆరు యాంటీ బాడీలు యాంటీ వైరల్ పనితీరును కోల్పోయాయి. మిగతా మూడు డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ పై 3  నుంచి 80 రెట్లు తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. రెండు డోసుల టీకా వేసుకున్న వారిలో అయిదు నెలల తరువాత ఒమిక్రాన్ వేరియంట్‌ను అణచివేసే శక్తి సామర్థ్యాలు యాంటీ బాడీలలో లేవని తేల్చారు పరిశోధకులు. ఎవరైతే బూస్టర్ డోస్ తీసుకుంటారో వారిలో మాత్రం ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా  పోరాడే శక్తిసామర్ధ్యాలు శరీరంలో కనిపించాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ను అణచివేయడానికి 5 నుంచి 31 రెట్లు ఎక్కువ యాంటీబాడీలు  అవసరం . 


ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన స్పైక్ ప్రోటీన్లోని మ్యుటేషన్లు రోగనిరోధక ప్రతిస్పందన నుంచి తప్పించుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఎందుకు ఎక్కువగా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి, బూస్టర్ డోస్ ఎంత కాలం పాటు వైరస్ నుంచి కాపాడుతుందో తెలుసుకోవడానికి మరింత లోతైన పరిశోధనలు అవసరం అని చెబుతున్నారు అధ్యయనకర్తలు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: ఈ మూడు లక్షణాలు కనిపిస్తే అది ఒమిక్రాన్ కావచ్చు... తేలికగా తీసుకోవద్దు


Also read: సెలెబ్రిటీ గాసిప్స్ ఇష్టపడేవారికి తెలివి తక్కువగా ఉంటుంది... కొత్త అధ్యయన ఫలితం


Also read:  పంది గుండె మనిషికి ప్రాణం పోసింది, చరిత్రలోనే తొలిసారిగా జంతువు గుండెతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్



Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు


Also read: కుకీలు, బిస్కెట్లు మిగిలిపోయాయా... వాటితో ఈ సింపుల్ రెసిపీలు చేసుకోవచ్చు


Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?


 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.