Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి!

రోజూ మనం వినియోగించే టూత్‌పేస్ట్‌ వల్ల కొత్త ప్రమాదం వచ్చిందని తాజా అధ్యయనంలో తేలింది. అదేంటో మీరే చూడండి.

Continues below advertisement

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్‌తో గడగడలాడుతోంది. బయటకి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండాలని ప్రజల జీవన విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయి. అయితే మనం ఉదయం రోజూ పళ్లు తోముకునే పేస్ట్ వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయట. అవును షాక్ అయ్యారా? తాజా అధ్యయనం ఏం చెప్పిందో మీరే చూడండి.

Continues below advertisement

టూత్‌పేస్ట్‌లో వాడే ట్రైక్లోజన్ అనే యాంటీ బ్యాక్టీరియల్‌ ఏజెంట్ వల్ల పేగుల్లో మంట వచ్చే ప్రమాదముందని ఈ అధ్యయనంలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా, యూనివర్సిటీ ఆఫ్ మాసచూసెట్స్ ఆమ్‌హెస్ట్, హాంకాంగ్ బాప్తిస్ట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసిన ఈ అధ్యయన ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఎలుకలపై చేసిన ఈ ప్రయోగంలో టూత్‌పేస్ట్‌లో వాడే ట్రైక్లోజన్ వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియా, ఎంజైమ్స్ వ్యాపిస్తున్నట్లు తేలింది. ఈ ట్రైక్లోజన్‌ను బొమ్మల తయారీ సహా వేల రకాల ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నారు. 

ఇలాంటి పేగులు మంట రావడానికి కారణమయ్యే బ్యాక్టీరియాను గుర్తించి తగిన చికిత్స అందించేందుకు కొత్త విధానాలను పరిశోధిస్తున్నామని అధ్యయనకర్త మేథ్యూ రెడిన్‌బో తెలిపారు.

ఎలా సాధ్యం?

ట్రైక్లోసన్ కొన్ని ఎంజైమ్‌ల సహాయంతో పేగుల్లో మంటను కలిగిస్తుందని అధ్యయనం కనుగొంది. గట్ మైక్రోబియల్ బీటా-గ్లూకురోనిడేస్ (GUS) ప్రోటీన్‌ల వంటి నిర్దిష్ట గట్ మైక్రోబియల్ ఎంజైమ్‌లను ట్రైక్లోసన్‌కు జోడించి పరిశోధించారు. దీని వల్ల పేగుల్లో మంట ఎలా వస్తుందో కనుగొన్నారు.

ఎఫ్‌డీఏ నిషేధం..

ఇంతకుముందు ట్రైక్లోజన్‌ను పలు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుల తయారీలో వినియోగించేవారు. కానీ హ్యాండ్ వాషింగ్ ప్రొడక్ట్స్, ఆసుపత్రి పరికరాల్లో ట్రైక్లోజన్‌ను వినియోగించకూడదని 2016లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) ఆదేశాలిచ్చింది.

కానీ ఇప్పటికీ కాస్మోటిక్స్, యోగా మ్యాట్‌లు, అథ్లెటిక్ బట్టల్లో బ్యాక్టీరియల్ కంటామినేషన్‌ను తగ్గించేందుకు ట్రైక్లోజన్‌ను వాడుతున్నారు. కానీ టూత్‌పేస్ట్‌లలో వాడేందుకు FDA అనుమతి ఇచ్చింది. ఇందుకు కారణం.. చిగుళ్లలో వచ్చే జింజివిటీస్ అనే రోగం నుంచి ట్రైక్లోజన్ రక్షిస్తుంది.

కానీ ఇప్పుడు ఇదే ట్రైక్లోజన్‌ వల్ల పేగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 

Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?

Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola