కోవిడ్ బారిన పడుతున్న ఢిల్లీ ప్రజలకు మనోదైర్యం ఇవ్వడానికి సీఎం కేజ్రీవాల్ కొత్త ఆలోచన చేశారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు యోగా, ప్రాణాయామంపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. యోగా ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకోవచ్చని చెబుతున్న కేజ్రీవాల్.. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారందరికీ.. యోగా క్లాసులు ఇప్పించాలని నిర్ణయించారు. పాజిటివ్ వ్యక్తుల ఫోన్లకు నేడు ఒక లింక్ పంపిస్తామని ప్రకటించారు. బుధవారం నుంచి బ్యాచ్‌ల వారీగా ఆన్‌లైన్‌లో క్లాసులు మొదలవుతాయని సీఎం ప్రకటించారు.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో లాక్‌డౌన్ పెట్టే యోచనలేదని ఇదివరకే కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రజలంతా కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తే లాక్‌డౌన్ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక ఢిల్లీలో రోజూవారీ కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 19,166 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో 65,806 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ మొత్తం సంఖ్య 8,21,446. అలాగే ఢిల్లీలో ఇప్పటివరకు 546 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
నెలాఖరుకు ఢిల్లీలో రోజుకు ఆరు లక్షల కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాన్ని నిపుణులు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ప్రజలు భయాందోళనలు చెందకుండా ఎక్కువ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హోంఐసోలేషన్ కిట్లు.. ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. వైద్య సౌకర్యాలు పెంచుతున్నారు. ఈ క్రమంలో యోగానూ తప్పనిసరి చేశారు.
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!