వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతోంది. ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ స్వామి, వెల్లంపల్లె శ్రీనివాస్, గౌతం రెడ్డి, గుమ్మనూరు జయరాం, అనిల్‌కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్, అప్పలరాజు, ఆదిమూలం సురేష్,‌ బాలినేని శ్రీనివాస్, వేణుగోపాల్ కృష్ణలు కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేసి స్వామి వారి ఆశీస్సులు పొంది మొక్కులు చెల్లించుకున్నారు.


వైకుంఠ ఏకాదశి‌ పర్వదినం నాడు తిరుమల శ్రీవారిని‌ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వేకువ జామున వైకుంఠ ద్వారం గుండా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి టీఎస్. దినేష్ కుమార్, కర్ణాటక సీజే రూతూ రాజ్ అవస్ధీ, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైసీపి ఎమ్మెల్యే ‌చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, సినీ డైరెక్టర్లు మారుతీ, తిరుమల కిషోర్, లక్ష్మీ‌పార్వతీ, ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ ఎంపీ‌ మార్గానీ భరత్,‌ గోరంట్ల మాధవ్ కుటుంబ సభ్యులతో కలిసి‌ స్వామి వారి‌ సేవలో పాల్గొని‌ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.


తెలంగాణ మంత్రులు కూడా..
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారు జామున రెండు గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కావడంతో తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, బీజేపీ నేత డీకే అరుణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ నేత లక్ష్మారెడ్డి, సునీత లక్ష్మీ రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మల్లారెడ్డిలు వేర్వేరుగా వైకుంఠ ద్వార ప్రవేశం చేసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం అందించగా.. ఆలయ అధికారులు‌ పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


Also Read: Gold-Silver Price: నేడు రూ.100 ఎగబాకిన పసిడి ధర.. 3 వేలకు పైగా వెండి పతనం.. ఇవాల్టి ధరలు ఇవే..


Also Read: జాతకాలు తేల్చుకుందాం.. దమ్ముంటే ఓపెన్‌ డిబేట్‌కు రండి.. వైఎస్అర్‌సీపీ ఎమ్మెల్యేలకు తమ్మారెడ్డి సవాల్ !


Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి