వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబైంది. అర్ధరాత్రి 12.05 గంటలకు ద్వార దర్శనం తెరుచుకోనుంది. ధనుర్మాస పూజలు చేయనున్నారు. ఆ తర్వాత.. 1.45 నుంచి దర్శనాలు ప్రారంభం అవనున్నట్టు టీటీడీ తెలిపింది. 10 రోజుల పాటు ఈ దర్శనాలు కల్పించడం జరుగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం.. 11 మంది మంత్రులు, 33 మంది హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు వస్తారు.


గురువారం నుంచి జనవరి 22వరకు అంటే పదిరోజులు.. వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లను టీటీడీ చేసింది. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 10 రోజుల పాటు స్థానికులకు టికెట్లు జారీ చేస్తారు. రామచంద్ర పుష్కరణి, ఎమ్మార్ పల్లి జడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్, సత్యనారాయణ పురం జడ్పీ హైస్కూల్, నగరపాలక సంస్థ కేంద్రాల్లో టికెట్లు జారీ చేస్తున్నారు.


ఈ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి లేదు


భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో  వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం, తెప్పోత్సవానికి భక్తులకు పర్మిషన్​ లేదని కలెక్టర్​ అనుదీప్​ తెలిపారు. ఒమిక్రాన్ కారణంగా ఈ నెల 12న నిర్వహించనున్న తెప్పోత్సవంతో పాటు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతించడం లేదన్నారు. శాస్త్రోక్తంగా కొద్ది మంది అర్చకులు, వేదపండితుల  సమక్షంలో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆన్​లైన్​ లో టికెట్లను బుక్​ చేసుకున్న వారికి తిరిగి క్యాష్​ చెల్లిస్తామన్నారు. తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం భద్రాచలం రావద్దని సూచించారు. 


హైదరాబాద్ న్యూ నల్లకుంట  సీతారామాంజనేయ సరస్వతీదేవి ఆలయంలో ఉత్తరద్వార దర్శనానికి అనుమతి లేదని ఆలయ ఈవో శ్రీధర్‌ తెలిపారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేయించాలనుకునే భక్తులు ఆలయ గుమస్తా వద్ద టికెట్టు తీసుకుంటే వారు భక్తుల గోత్ర నామాలపై పూజలు నిర్వహిస్తారన్నారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున తీర్థ, ప్రసాద వితరణ కూడా నిషేధమన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కూర్చోవడానికి కూడా అనుమతి లేదని..వైరస్ కట్టడికోసం అంతా సహకరించాలన్నారు. 


Also Read: Bhogi Wishes in Telugu: భోగ భోగ్యాల భోగి రోజు.. ఇలా శుభాకాంక్షలు చెప్పండి


Also Read: Makar Sankranti 2022: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...


Also Read: Makar Sankranti 2022: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…