Breaking News Live Telugu Updates: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..
ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత అధికారులు..
8 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం..
చిత్తూరు, నెల్లూరు అనంతపురం విజయనగరం ,బాపట్ల ,కర్నూలు కృష్ణ, సత్యసాయి జిల్లాలకు కొత్త కలెక్టర్ నియామకం..
కవర్ అడ్డం పెట్టి మొబైల్ ఫోన్ కొట్టేసిన కిలాడీ...
కరీంనగర్ బస్టాండ్ సమీపంలోని హోటల్లో మాజీ సర్పంచ్ ఫోన్ కొట్టేసిన దొంగ.
చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు.
టిఫిన్ చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి హోటల్ కు వచ్చివ వీణవంక మండలం దేశాయి పల్లికి చెందిన లక్ష్మణ్ అనే మాజీ సర్పంచి.
కౌంటర్ వద్ద టోకెన్ తీసుకుంటుండగా పాలిథిన్ కవర్ అడ్డుపెట్టి జేబులో నుంచి ఫోన్ కొట్టేసిన దొంగ .
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఎమ్మెల్యే ఈటలకు నోటీసులు
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి కమలాపూర్ పీఎస్ ఎస్ఐ నేరుగా వెళ్లి నోటీసులు అందజేశారు.
కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది మంది హనుమాన్ భక్తులు భవంతుణ్ణి ఆశీస్సులు తీసుకుని అనంతరం హనుమాన్ శోభాయాత్రకు బయల్దేరారు. కర్మన్ ఘాట్ సైదాబాద్ మీదుగా సరూర్ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట్, కోఠి మీదుగా తాడ్ బండ్కు చేరుకుంటుంది.
జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తి భార్య ఈ ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ మనస్తాపంతో గదిలోకి వెళ్లి ఎస్సై కూడా తుపాకీతో కాల్పుచుకొని చనిపోయారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడా వద్ద ఓ అంబులెన్స్ అదుపుతప్పి వాగులో బోల్తా పడింది. మృతదేహాన్ని తరలిస్తుండగా.. అంబులెన్స్ తరోడా వాగులో పడిపోయింది. అందులో మరో నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారు. జైనథ్ వైపు నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నలుగురు వ్యక్తులు వాగులోంచి సురక్షితంగా బయట పడ్డారు. స్థానికులు గమనించి వారికి సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వాగులోంచి తీసి ఒడ్డున చేర్చారు.
విజయనగరానికి చెందిన ఓ నేవీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. నేవీ కమాండర్ గోవింద్ కోల్ కతాలో ప్యారాచ్యూట్ ట్రైనింగ్ లో ఉండగా అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రైనింగ్ లో భాగంగా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ప్యారాచ్యూట్ వేసుకొని, సురక్షితంగా కింద ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ, వందల అడుగుల ఎత్తులో ఉండగా ప్యారాచూట్ తెరుచుకోలేదు. దీంతో వేగంగా ఢీకొని చనిపోయాడు.
Background
నిన్నటి ద్రోణి/గాలి విచ్చిన్నతి, ఈ రోజు ఛత్తీస్ గఢ్ లోని మధ్య భాగాల నుండి విదర్భ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మి ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షంలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది.
Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కురిసే అవకాశం ఉంది. ఇంకా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కి మీ వేగం ) తో పాటు వడగళ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
నేడు తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 55 శాతం నమోదైంది.
ఏపీలో వర్షాలు ఇలా
‘‘నేడు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నమోదవనుంది. ప్రస్తుత పరిస్ధితులను గమనించినట్లు అయితే అధిక పీడన ప్రాంతం తెలంగాణ మీదుగా కొనసాగుతోంది. దీని వలన రాయలసీమ జిల్లాల్లో వేడి గాలులు విస్తారంగా మధ్యాహ్నం, సాయంకాలం కొనసాగుతుంది కాబట్టి, నంధ్యాల, కర్నూలు, కడప, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో వేడి గాలులు కొనసాగనుంది. కానీ కోస్తాంధ్రలో కాస్త భిన్నంగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్.టీ.ఆర్., కొనసీమ, కృష్ణ, ప్రకాశం జిల్లాలోని తూర్పు భాగాలు, నెల్లూరు జిల్లాలోని తూర్పు భాగాలు, తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నేడు నమోదుకానున్నాయి.
రాయలసీమలో ఎండలు విపరీతంగా
రాయలసీమ వ్యాప్తంగా వేడి విపరీతం అయింది. నేడు అత్యధికంగా కర్నూలు నగరంలో 41.5 డిగ్రీలు నమోదయ్యింది. నేడు కూడ భారత దేశంలో ఎండలలో మొదటి స్ధానంలో కర్నూలు నిలుస్తోంది. మరో వైపున అధికపీడన ప్రాంతం కొనసాగుతోంది కాబట్టి రాయలసీమ జిల్లాల్లో వేడి రానున్న రోజుల్లో పెరగనుంది. జాగ్రత్తలు తీసుకోగలరు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -