Indian Forest Service (Preliminary) Examination 2025 through CS(P) Examination 2025: ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌-2025 నోటిఫికేషన్‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ జనవరి 22న విడుదల చేసింది. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆధారంగా మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. మే 25న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే దీనికి కూడా ప్రామాణికంగా భావిస్తారు. మెయిన్ పరీక్షను మాత్రం విడిగా నిర్వహిస్తారు. తదనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేస్తారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 


వివ‌రాలు...


* ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ (ప్రిలిమిన‌రీ) ఎగ్జామినేష‌న్- 2025


ఖాళీల సంఖ్య: 150.

అర్హత:
డిగ్రీ (యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ/ వెట‌ర్నరీ సైన్స్/ బోట‌నీ/ కెమిస్ట్రీ/ జియాల‌జీ/ మ్యాథ‌మెటిక్స్/ ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్‌/ జువాల‌జీ) (లేదా) డిగ్రీ (అగ్రిక‌ల్చర‌ల్/ ఫారెస్ట్రీ/ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత‌ ఉండాలి.


వయోపరిమితి: 01.08.2025 నాటికి 21 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1993 - 01.08.2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (బెంచ్ మార్క్ డిజబిలిటీస్), మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక‌ విధానం: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేష‌న్, మెయిన్ ఎగ్జామినేష‌న్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే దీనికి కూడా ప్రామాణికంగా భావిస్తారు. మెయిన్ పరీక్షను మాత్రం విడిగా నిర్వహిస్తారు. తదనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్‌, వరంగల్‌. మెయిన్స్‌ పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.


ఆప్షనల్ సబ్జెక్ట్‌ల లిస్ట్: 


➥ అగ్రికల్చర్


➥ అగ్రికల్చర్ ఇంజినీరింగ్


➥ యానిమల్ హస్బెండరీ & వెటర్నరీ సైన్స్


➥ బోటనీ


➥ కెమిస్ట్రీ


➥ కెమిస్ట్రీ ఇంజినీరింగ్


➥ సివిల్ ఇంజినీరింగ్


➥ ఫారెస్ట్రీ


➥ జియాలజీ


➥ మ్యాథమెటిక్స్ 


➥ మెకానికల్ ఇంజినీరింగ్


➥ ఫిజిక్స్


➥ స్టాటిస్టిక్స్


➥ జువాలజీ


అభ్యర్థులు కొన్ని సబ్జెక్టుల కలయికను ఎంచుకోవడానికి అనుమతించబడరు, అవి:


➥ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 


➥ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ & వెటర్నరీ సైన్స్


➥ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ


➥ కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజినీరింగ్


➥ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్


➥ ఇంజినీరింగ్ సబ్జెక్టులలో అగ్రికల్చర్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ మరియు మెకానికల్ ఇంజినీరింగ్ వీటిలో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులకు అనుమతి లేదు


ముఖ్యమైన తేదీలు..


✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2025.


✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.02.2025. (6 PM)


✦ ప్రిలిమ్స్ పరీక్ష తేది: 25.05.2025.


Notification
Online Application
Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..