AP CM Chandrababu Meet With Microsoft Billgates: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధికి సహకారం అందించాలని.. గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్‌వేగా నిలపాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి లోకేశ్ మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్‌గేట్స్‌ను (Billgates) కోరారు. దావోస్ పర్యనటలో భాగంగా వారు.. దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్‌లో బుధవారం ఆయనతో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటీ కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్‌గేట్స్‌కు చంద్రబాబు గుర్తు చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని లోకేశ్ బిల్‌గేట్స్‌ను కోరారు. 'మీ అమూల్యమైన సలహాలు మా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్‌ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌బోర్డ్‌ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరఫున నైపుణ్య సహకారాన్ని అందించండి. దక్షిణ భారతంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపండి. మీ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలు అమలు చేసేలా ప్రభుత్వం పని చేస్తుంది.' అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. విజనరీ లీడర్ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందని.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా బిల్‌గేట్స్ చెప్పారు.
Also Read: Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు