Breaking News Live Telugu Updates: ఆదిలాబాద్‌లో రోడ్డు ప్రమాదం- ముగ్గురు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 19 Jul 2022 05:04 PM
ఆదిలాబాద్‌లో రోడ్డు ప్రమాదం- ముగ్గురు మృతి

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరితాండ సమీపంలో మూడు బైకులు ఢీకొని ముగ్గురి మృతి. ఒకరి పరిస్థితి విషమం. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలింపు.

పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం!

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం, బెల్లంకొండ మండలం చంద్రాజుపాలెంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చర్చనీయాంశమైంది. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఓర్చు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. తనకు డబ్బులు ఇవ్వాలని బాధితుడి వదిన పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి ఓ కానిస్టేబుల్ కారణమని బంధువులు చెబుతున్నారు. ఐదు రోజుల క్రితం బెల్లంకొండ స్టేషన్‌ పోలీసులు వచ్చి విచారణకు తీసుకెళ్లారు. గుప్త నిధుల కేసుతో సంబంధం ఉందంటూ తప్పుడు ఆరోపణలతో పిడుగురాళ్ల స్టేషన్‌కు తీసుకొని వెళ్ళి సిఐ ఆంజనేయులు నాలుగు రోజులుగా చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. పోలీసుల చిత్రహింసలను తట్టుకోలేక రాత్రి పురుగుమందు తాగి  ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని చెబుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో రెడ్డిగూడెం ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై వివరణ కోరగా పోలీసులు అందుబాటులోకి రావడం లేదు. విషయాన్ని గోప్యంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

CI Nagaraju Police Custody: సీఐ నాగరాజు రెండోరోజు పోలీస్ కస్టడీ నేడు

  • నేడు రెండవ రోజు సీఐ నాగేశ్వరరావు పోలీస్ కస్టడీ

  • ఇప్పటికే నాగేశ్వర్రావును 5 రోజుల పాటు పోలీస్ కస్టడికి అనుమతిఇచ్చిన న్యాయస్థానం

  • చర్లపల్లి జైల్ నుండి కస్టడీకి తీసుకున్న వనస్థలిపురం పోలీసులు

  • ఈనెల 22 వరకు విచారించనున్న పోలీసులు

  • సరూర్ నగర్ ఎస్వోటీ కార్యాలయంలో విచారిస్తున్న పోలీసులు

  • ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు, ఇప్పటికే ఆధారాలు సేకరించిన పోలీసులు

  • కీలక ఆధారాల కోసం సాగుతున్న విచారణ

  • నిందితుడి వద్ద నుండి షాంపిల్స్ సేకరించి FSL కు పంపనున్న పోలీసులు

  • సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరపనున్న పోలీసులు

  • నిందితుడి కన్ఫేషన్ స్టేట్మెంట్  రికార్డు చేయనున్న పోలీసులు

NIA Raids: మావోయిస్టు ఆర్కే భార్య శిరిష ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని దివంగత మావోయిస్టు ఆర్కే భార్య శిరిష, విరసం నేత కళ్యాణ్ రావు నివాసంలో ఎన్ఐఏ బృందం తనిఖీలు చేస్తోంది. ఏకకాలంలో రెండు చోట్ల బృందాలుగా విడిపోయి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అత్యంత గోప్యంగా సుమారు ఉదయం 6:39నుండి సోదాలు ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

CM Jagan: సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన వారికి నిధుల విడుదల నేడు

  • సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎం

  • వివిధ పథకాలకు 3 లక్షల 39 వేల 96 మంది లబ్ధిదారులు కొత్తగా ఎంపిక

  • పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం లబ్ధిదారుల ఎంపిక

  • ఆయా పథకాల కోసం 935 కోట్లు నిధులు విడుదల చేయనున్న సీఎం

  • ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నగదు జమ చేయనున్న సీఎం

Palnadu TDP Leader Murder Attempt: టీడీపీ లీడర్‌పై హత్యాయత్నం, గొడ్డళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు

  • పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డిపై హత్యాయత్నం

  • అలవల గ్రామంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో గొడ్డళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు

  • బాలకోటి రెడ్డికి తీవ్ర గాయాలు, నరసరావుపేట ఆస్పత్రికి తరలింపు

  • గతంలో రొంపిచర్ల ఎంపీపీగా పని చేసిన వెన్న బాల కోటిరెడ్డి

  • ఆసుపత్రిలో బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా.చదలవాడ అరవింద బాబు

Background

Southwest Monsoon: ఏపీ, తెలంగాణలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కువరనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, కోట, గుణ, ఈశాన్య విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం రాయ్‌పూర్, పరదీప్ గుండా ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల పై వరకు విస్తరించి ఉంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని.. ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు సైతం వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో నేడు సైతం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ జిల్లాలకు నేడు సైతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మరోవైపు గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుతోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్షలో తెలిపారు.  


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలుండగా, రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దుల్లో, కర్నూలు జిల్లాలోని కొన్ని చోట్ల నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయి.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. 5 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.