Unstoppable with NBK S4 Ram Charan Episode Promo : గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 (UnstoppablewithNBKS4)కి వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ కాగా.. తాజాగా ఆహా దానికి సంబంధించిన నాలుగు నిమిషాల ప్రోమోను విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది.. శర్వానంద్‌తో కలిసి రామ్ చరణ్ పంచుకున్న విషయాలు ఏమిటో, ప్రోమో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
అన్‌ప్రిడిక్టబుల్ ధిస్ సంక్రాంతి అంటూ.. ప్రోమోను ప్రారంభించారు. సర్‌ప్రైజ్‌ల మీద సరప్రైజ్లు ఉన్నాయంటూ.. రామ్ చరణ్‌కు చెప్పి.. చెర్రీకి కాస్త టెన్షన్ పెంచేశారు బాలయ్య. దానికి బదులుగా కొంచెం టెన్షన్‌గా ఉందిసార్ అంటూ చెర్రీ రిప్లై ఇచ్చి ఫన్ క్రియేట్ చేశారు. నువ్వు నాకు ఏంటో తెలుసా.. మెగా ఫ్యామిలీ స్టార్ అంటూ బాలయ్య చెప్పారు.
మనవడు కావాలట..
నీ గురించి మీ అమ్మగారిని, మీ నాయనమ్మగారిని అడిగాము. ఏమన్నారేంటి సార్ అంటూ చెర్రీ అడగ్గా.. నావల్ల కాదు చెప్పడం అంటూ బాలయ్య బదులిచ్చారు. వారికి సంబంధించిన వీడియో ప్లే చేశారు బాలయ్య. అనంతరం చరణ్ అమ్మ, నానమ్మ దగ్గర్నుంచి వచ్చిన లెటర్ని చెర్రీకి ఇచ్చారు బాలయ్య. దానిలో 2025లో ఓ మనవడు కావాలంటూ తమ మనసులోని కోరికను రాసి ఇచ్చారు. దీనిని రామ్ చరణ్ చదవగా.. ఈ సీన్లో నేను జస్ట్ నారదుడిని మాత్రమే అంటూ బాలయ్య చెప్పారు.
పార్టీకి వాళ్లతో వెళ్లను.. మామే బెస్ట్..
రొయ్యలతో ఆమ్లెట్‌ని మీ అమ్మ అదరగొడతారని బాలయ్య చెప్పగా.. దోశ, ఆమ్లెట్ ఎవరైనా చేస్తారంటూ చరణ్ బదులిచ్చాడు. దీంతో ఆడియన్స్ సైతం నవ్వేశారు. షాకైనా బాలయ్య సైలెంట్‌గా కనిపిస్తారు కానీ.. పెద్ద ఫిట్టింగ్ మాస్టరంటూ ఫన్ క్రియేట్ చేశారు. అనంతరం నాగబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి.. వీళ్ల ముగ్గురిలో పార్టీకి ఎవరితో వెళ్తావని చెర్రీని అడగ్గా.. వీళ్లతో ఎవ్వరితో వెళ్లను. మామతో వెళ్తాను. పార్టీలకు అరవింద్ మామ బెస్ట్ అని బదులిచ్చేశాడు చరణ్.
క్లీంకారను చూపించేది అప్పుడే..
2023లో మీ నాన్నగారికి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చావు. అదే క్లీంకార. ఆడపిల్ల పుడితే ఇంట్లో అమ్మవారు పుట్టినట్టే అంటూ బాలయ్య చెప్పగా.. చరణ్ కంటతడి పెట్టుకున్నాడు. పాపకి అన్నం పెడతాడంటూ.. చరణ్ నానమ్మ చెప్పగా.. రోజూ ఉదయాన్నే పాపతో రెండు గంటల సమయం కేటాయిస్తాను. ఫుల్‌గా ఆడుకుంటూ పాపకి తినిపిస్తాను. చూడడానికి బక్కగా ఉంటుంది కానీ.. మొత్తం తిరిగేస్తుందంటూ.. పాప గురించి ఎమోషనల్‌గా చెప్పారు చరణ్. క్లీంకార నన్ను ఎప్పుడు నాన్న అని పిలుస్తాదో అప్పుడు తన మొహాన్ని అందరికీ చూపిస్తానంటూ చరణ్ గుడ్ న్యూస్ చెప్పేశారు.
రైమ్ అండ్ ఫ్రెండ్స్..
ఉపాసనతో గొడవ అయితే ఎలా క్లియర్ చేసుకుంటావని అడగ్గా.. రైమ్ గురించి చెప్పాడు చెర్రీ. రైమ్‌కి మేడమ్ టుస్సాడ్‌లో ఉన్న రికార్డు చెప్పగా.. నీలాగే అది కూడా రికార్డ్‌లు క్రియేట్ చేస్తుందని బాలయ్య చెప్పారు. అనంతరం రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితుడు శర్వానంద్‌ను స్టేట్పైకి పిలిచారు. చరణ్ మెసేజ్‌లలో కూడా దొరకడు సార్ అంటూ శర్వా చెప్పగా.. దొరికితే వాడే దొరుకుతాడు సార్.. అమాయకుడు అంటూ చరణ్ చెప్పాడు.
పవన్ కళ్యాణ్ యాక్టర్‌గా బెటరా? రాజకీయ నాయకుడిగా బెటరా అంటూ చరణ్‌ని డైలామాలో పెట్టారు బాలయ్య. అనంతరం ఇలాంటి ఇంట్రెస్టింగ్, ట్రబుల్ క్వశ్చన్స్‌ని అడిగారు బాలయ్య. నన్ను వదిలేయండి అంటూ చరణ్ భయపడినట్లు ప్రోమోలో చూపించారు. అనంతరం దిల్ రాజు కూడా షోకి వచ్చారు. బాలయ్య పాటలకు డ్యాన్స్ వేస్తానంటూ దిల్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ప్రభాస్‌తో ఫోన్ కాల్ కూడా ఈ షోకి ఎక్స్ట్రా బోనస్‌గా మారనుంది. ఈ ఫన్‌తో కూడిన ఎపిసోడ్ జనవరి 8వ తేదీన, సాయంత్రం 7 గంటలకు ఆహాలో ప్రీమియర్ కానుంది.
Also Read : బాబాయ్ - అబ్బాయ్ బాండింగ్ చూశారా... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో హైలైట్ మిస్ అవ్వొద్దు