Breaking News Live Telugu Updates: ఏప్రిల్ 29 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పొడిగింపు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 19 Apr 2023 07:23 PM
ఏప్రిల్ 29 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పొడిగింపు

‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమంలో భాగంగా... సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, స్థానిక నాయకులతో కలిసి డోర్-టు-డోర్ పర్యటించే క్రమంలో... రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సభ్యులు అపూర్వ భాగస్వామ్యం అవుతున్న తీరు, మరియు గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనపట్ల విశేష సానుకూల స్పందన వస్తున్న నేపధ్యంలో ఈ ప్రచార కార్యక్రమ షెడ్యూలును 2023 ఏప్రిల్ 29 వరకు పొడిగించడమైనది.


మెగా సర్వే ఫలితాలను కూడా అదేరోజున (29.04.2023) ప్రకటించడం జరుగుతుందని తెలియచేస్తున్నాము.


పార్టీ కేంద్ర కార్యాలయం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తాడేపల్లి

బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు మహారాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరణ

ఈ నెల 24వ తేదీన మహారాష్ట్రలో జరగనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు. 
భద్రతా కారణాల దృష్ట్యా అంఖాస్‌ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్‌ పోలీసులు స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. 
ఔరంగాబాద్ పోలీసులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
మరోవైపు అదే రోజున వేరే ప్రదేశంలో బహిరంగ సభను నిర్వహించడానికి గులాబీ దళం సిద్ధమైంది.

YS Viveka Case: వివేకా కేసులో అదే జరుగుతోంది - సునీల్ దియోధర్

తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదని, ప్రస్తుతం వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయ స్ధాయి ప్రతిభా పోటీల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిపై సునీల్ ధియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారని, వైసీపీ నేతలు సీబీఐని నిందించడం సరైన విధానం కాదన్నారు.. ఫ్యాక్షన్ ప్రభుత్వంగా పేరు సంపాదించుకున్న వైసీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.. జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామితో పెట్టు కుంటున్నాడని ఏడుకొండల వాడితో పెట్టుకున్న వారెవరు చరిత్రలో బాగు పడలేదని, సీఎం జగన్ నాశనం అయిపోతాడని, 2024 ఎన్నికల తరువాత ఏపిలో వైసీపీ పార్టీ ఉండదన్నారు.. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని ఆయన అన్నారు.. టీటీడీలో అన్యమతస్తులను ప్రోత్సహిస్తున్నారని, గత కొన్ని రోజుల ముందు టీటీడీ ఇచ్చిన నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.. రెండు రోజుల్లో నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున  రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

CM Jagan: సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలోనే నా కాపురం - సీఎం జగన్ సంచలన ప్రకటన

 


వచ్చే సెప్టెంబరు నెల నుంచి తన కుటుంబం విశాఖపట్నానికి తరలి వెళ్తున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. మూలపేట పోర్టు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సంచలన ప్రకటన చేశారు. తన కాపురం వచ్చే సెప్టెంబరు నుంచి విశాఖపట్నానికి తరలిస్తున్నట్లుగా చెప్పారు.

Viveka Murder: నిందితులు సీబీఐ అదుపులోకి..

  • నేడు వివేకా హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ 

  • ఈ నెల 14న అరెస్ట్ చేసిన A6 ఉదయ్ కుమార్ రెడ్డి 

  • ఈ నెల 16న అరెస్ట్ చేసిన A7 వైఎస్ భాస్కర్ రెడ్డిని మరి కాసేపట్లో కస్టడీకి తీసుకొనున్న సీబీఐ

  • నిన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిలకు కస్టడీ అనుమతించిన సీబీఐ కోర్టు

  • ఈనెల 19 నుంచి 24 వరకు కస్టడీ కి అనుమతి

  • 6 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చిన సీబీఐ కోర్టు

  • ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డి,ఉదయ్ కుమార్

  • చంచల్ గూడ జైలు నుండి నిందితులను కస్టడీ లోకి తీసుకొనున్న సీబీఐ

  • చంచల్ గూడ జైలు నుండి కస్టడీ లోకి తీసుకుని ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం సీబీఐ కార్యాలయంకి తరలించి విచారణ చేయనున్న సీబీఐ

MP Avinash Reddy: సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి 

  • కోఠి సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి 

  • అవినాష్ రెడ్డి అభిమానులను పార్టీ కార్యకర్తలను లోనికి అనుమతించని పోలీసులు 

  •  గేట్ వద్ద వాహనాలు నిలిపివేసిన పోలీసులు

  •  అవినాష్ రెడ్డి వాహనం మాత్రమే లోపలికి అనుమతి

Venkaiah Naidu: బూతులు మాట్లాడే నేతలకు ఓట్లేయకండి : మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు

  • విజయనగరం జిల్లా రాజాం జిఎంఆర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు

  • విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి

  • అసెంబ్లీ, పార్లమెంట్‌లో కొందరు నేతల అసభ్యకర ప్రవర్తనను దేశమంతా గమనిస్తోంది 

  • తల్లిని పోలిన మాతృభాషలోనే మాట్లాడండి, రాయండి 

  • సగం అటుగా, సగం ఇటుగా ఉన్న భాషా కల్తీలో కొట్టుకుపోవద్దు 

  • దేశ విద్యావ్యవస్థలో పెనుమార్పులు రావాల్సిన అవసరం ఉంది : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Srikakulam News: శ్రీకాకుళం కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం, మూడు షాపులు దగ్ధం

  • శ్రీకాకుళం కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం

  • ఓ బైక్ షోరూంలో ఎలక్ట్రిక్ బైకులకు చార్జ్ చేస్తుండగా ఏర్పడిన ప్రమాదం

  • మంటల్లో 90 బైకులు దగ్ధం ఎగసిపడతున్న మంటలు

  • పక్కనే ఉన్న హార్డ్ వేర్ దుకాణానికి వ్యాపించిన మంటలు

  • మూడు షాపులు ఈ- బైక్ షోరూం, బ్యాటరీ షాపు, పెయింట్ షాపు దగ్ధం

  • భారీగా అస్తి నష్టం, ప్రమాదానికి కారణాలు గుర్తిస్తున్న అధికారులు

  • సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది

Background

నిన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి  ఉన్న ద్రోణి/ గాలిలోని అనిచ్చితి, ఈ రోజు దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు  41 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది.


21వ తేదీ నుండి 4,5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి  అనేక చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. GHMC పరిధిలో 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు, రేపు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) వాయువ్య, ఉత్తర తెలంగాణ జిల్లాలలో వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


ఉత్తర తెలంగాణలో నిప్పుల కొలిమే
నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన నమోదయ్యాయి. గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలంటే భయపడ్డారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు కొంత ఉపశమనం లభించవచ్చని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదుకు అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 


తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భుపాలపల్లి,  ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు (30 నుంచి 40 కిలో మీటర్ల వేగం) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 42 శాతం నమోదైంది. 


ఏపీలో ఎండలు ఇలా
ఏపీలో ఎండలు విపరీతం అయ్యాయి. నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వెదర్ బులెటిన్ లో తెలిపారు.


‘‘ఏపీలో 21, 22 తేదీల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు కొన్ని చోట్ల వర్షాలు, గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాడగాడ్పులు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీ అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, క్రిష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కాస్త ఎక్కువగా వడగాడ్పులు ఉంటాయని అంచనా వేశారు.


‘‘కర్నూలు నగరం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది ఇలా ఉండగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వేడి అనేది 40 డిగ్రీలను దాటుతోంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్., ఏలూరు, కడప​, అన్నమయ్య​, అనంతపురం, నంధ్యాల​, కాకినాడ​, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలను తాకుతోంది. ఏప్రిల్ నెలలో ఇలా ఉండగా మే నెలలో మాత్రం వేడి ఇకా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్.నినో పసిఫిక్ లో ఏర్పడుతోంది కాబట్టి భారత భూభాగంలో ఉన్న తేమను లాగుతోంది. దీని వలన ఎండలు తీవ్రంగా మారుతున్నాయి. విశాఖ నగరంలో 40.7 డిగ్రీలు నమోదవుతోంది. అలాగే విజయవాడలో 43 డిగ్రీలు నమోదవుతోంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.