ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 గంటల్లో 63,717 మంది నమూనాలు పరీక్షించగా.. 1,502 కొత్త కేసులు నమోదయ్యాయి. 16 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,525 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,883 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొవిడ్‌ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఒకరు, ప్రకాశంలో ఒకరు మృతి చెందారు.


#COVIDUpdates: 04/09/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,16,807 పాజిటివ్ కేసు లకు గాను
*19,88,021 మంది డిశ్చార్జ్ కాగా
*13,903 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,883#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/8UmMkDL0Xp


— ArogyaAndhra (@ArogyaAndhra) September 4, 2021

" title="" >


Also Read: Pawan kalyan: పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం... పాఠశాల విద్యార్థులతో జెండా పట్టించి, నినాదాలు... వీడియోలు వైరల్


Pocso Case: ఏపీలో దారుణ ఘటన... బాలికపై సామూహిక అత్యాచారం... పోక్సో చట్టం కింద కేసు నమోదు


గురుపూజోత్సవాలు రద్దు...


గురుపూజోత్సవాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఈ ఏడాది వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గురుపూజోత్సవం, ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కార్ నిర్ణయం సరికాదని.. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కరోనా వేళ ఆన్‌లైన్ ద్వారా అయినా టీచర్స్ డే జరపాలని ఉద్యోగుల సమాఖ్య నేతలు కోరుతున్నారు.


Also Read: JSP For AP Roads : ఏపీ రోడ్ల బండారాన్ని బయట పెట్టిన జనసేన.. లక్షల్లో సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు ..!


ByPolls : మమతాకు స్వీట్.. ఈటలకు షాక్..! ఉపఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు..!


నెల్లూరు జిల్లా చిట్టేడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలలో 19 మంది విద్యార్థులు, ఓ అధ్యాపకుడు కొవిడ్‌ బారిన పడ్డారు. వీరందరినీ మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో చేర్పించినట్లు కోట మండల వైద్యాధికారి నాగరాజు వెల్లడించారు. మరోవైపు గ్రామంలోనూ నాలుగు కేసులు నమోదయ్యాయి. ఐటీడీఏ అధికారులు గురుకులాన్ని సందర్శించారు. మిగిలిన విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రిన్సిపల్‌ విజయలక్ష్మికి సూచించారు. 100 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.


Also Read: CJI NV Ramana: మా మూలాలు బార్ కౌన్సిల్ నుంచే మొదలు... న్యాయవ్యవస్థకు అవే పెద్ద సవాల్... సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ


Volunteer Letter: ప్రజలను సోమరిపోతులను చేయొద్దు...ప్రజాసమస్యలపై దృష్టి పెట్టండి ... వైరల్ అవుతున్న వాలంటీర్ లేఖ