చిక్ని చమేలీ గర్ల్ కత్రినా కైఫ్ కారణంగా ముఖానికి ఐస్ క్యూబులతో మర్ధన చేసుకోవడం అమ్మాయిలకు బాగా అలవాటైంది. తన అందానికి ఐస్ ప్యాకులే కారణమంటూ ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం చేసింది కత్రినా. దాంతో చాలా మంది ముఖానికి ఐసు గడ్డలతో మర్ధనా చేసుకోవడం మొదలుపెట్టారు. సెలెబ్రిటీ చెప్పగానే ఫాలో అయిపోయే అభిమానులే ఎక్కువ. అయితే ఆ బ్యూటీ టిప్ మన చర్మానికి పడుతుందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. 


వీరికి పడదు



ఐస్ క్యూబు ప్యాకులు మంచివే. ముఖంపై మొటిమలను నిరోధిస్తాయి, అలాగే రక్త ప్రసరణను పెంచుతాయి. కానీ అన్నిరకాల చర్మతత్వానికి ఇది సరిపడవు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారికి ఐస్ ప్యాక్ పడదు. వారి చర్మ రంధ్రాలు మరింతగా పొడిబారి పోయి పగుళ్లు ఏర్పడతాయి. దీని వల్ల చర్మసమస్యలు ఎదురుకావచ్చు. అలాగే విపరీతమైన తలనొప్పి కూడా కలిగే అవకాశం ఉంది. 


Also Read : వేడి వేడి బంగారు వడపావ్ కావాలా నాయనా? ధరెంతో తెలుసా..


అధిక సమయం వద్దు



అతి అనర్ధానికే దారి తీస్తుంది. అదే విధంగా అధిక సమయం పాటూ, పదే పదే ముఖంపై ఐసు క్యూబులతో మర్థనా చేయడం వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. చర్మం ఎరుపుగా మారి, దురదలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చర్మ రంధ్రాలు పూడుకుపోయి స్వేదం బయటికి రాకుండా చర్మంకిందనే ఉండిపోయే ప్రమాదం ఉంది. దాని వల్ల మొటిమల సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. 


Also Read : టీచర్స్ డే రోజు మీకు నచ్చిన ఉపాధ్యాయులకు మీరివ్వగలిగే బహుమతులు


మీది పొడి చర్మమా?



పొడి చర్మం ఉన్నవారు ఐసు క్యూబుల మర్ధనాకు దూరంగా ఉండాలి. చర్మం పొడిగా ఉన్నప్పుడు చర్మ రంధ్రాలు డ్యామేజ్ అయి ఉంటాయి. అలాంటి సమయంలో మర్ధనా చేస్తే రంధ్రాలు మరింతగా డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ మీకు మొటిమలు, వాపు లాంటివి ఉంటే రోజు తప్పించి రోజు ఐసు ప్యాకులు ప్రయత్నించవచ్చు. పొడి చర్మం కలవారికి చల్లని ఉత్పత్తుల వల్ల పెద్ద లాభం ఉండదు. 


ఇలా చేయండి



ఐసు క్యూబులతో నేరుగా చర్మంపై మర్ధనా చేయకూడదు. ఒక వస్త్రంలో చుట్టి మర్ధనా చేసుకోవాలి. టమాటా ప్యూరీ, కీరా దోస రసం, అలోవెరా జ్యూసు వంటివాటిని ఫ్రీజర్లో ఐసు క్యూబులుగా గడ్డకట్టేలా చేసి వాటితో మర్ధనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే రోజూ మర్ధనా చేసే వారు పది నిమిషాలకు మించి ఎక్కువ సమయం చేయరాదు.