Roja : సంపాదనంతా దాని కోసమే ఖర్చైపోయింది.. పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు.. గతం తలచుకొని రోజా కంటనీరు

ఎప్పడూ నవ్వుతూ కనిపించే రోజా మొహం ఒక్కసారిగా ముడుచుకుపోయింది. గతంలో పడిన కష్టాలు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. వినాయకచవితి సందర్భంగా నిర్వహించిన స్పషల్ షోలో ఇలా జరిగింది.

Continues below advertisement

జబర్దస్త్ కామెడీ షో లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ పంచ్ లు వేస్తూ నవ్వుతూ, నవ్వించే రోజా సెల్వమణి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ వైపు రాజకీయాలు-మరోవైపు టీవీ షోస్ తో బిజీ బిజీగా ఉండే రోజా తన వ్యక్తిగత విషయాలు చెప్పి బాధపడ్డారు. ఇన్నాళ్లు తనలో దాచుకున్న విషయాన్ని ఓ షోలో ఓపెన్ గా చెప్పేసి భారం రిలీఫ్ గా ఫీలయ్యారు. హీరోయిన్ గా ఉన్నప్పుడు, పెళ్లితర్వాత వివిధ సందర్భాల్లో తాను అనుభవించిన కష్టాలను చెప్పారు. వినాయక చవితి సందర్భంగా షూట్ చేసిన ఓ స్పెషల్ షోలో ఇదంతా జరిగింది

Continues below advertisement

రోజాఏమన్నారంటే.. 1991లో ఇండస్ట్రీలోకి వచ్చానని 2002 వరకు కష్టపడిన డబ్బులు మొత్తం అప్పులు కట్టానంటూ రోజా ఎమోషనల్ అయ్యారు. పెళ్లికి ముందే తనకు డాక్టర్లు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు కానీ.. పెళ్లైన ఏడాదికే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయి అన్షు పుట్టిందన్నారు. అందుకే తన కుమార్తే అంటే ఏంతో ప్రేమఅన్నారు.కన్నీళ్లు పెట్టుకున్న రోజాను ఇంద్రజ వెళ్లి  గట్టిగా కౌగిలించుకుని ఓదార్చింది. ఆమె మాటలకు ఆ షోలో ఉన్న ప్రతీ ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో రోజా తన కూతురు అన్షు, కుమారుడితో కలిసి రోజా పాల్గొన్నారు. 

Also Read: సరదా తీరిపోతోంది..ఇంక నావల్లకాదంటున్న హీరో కార్తికేయ , అలరిస్తోన్న ''రాజా విక్రమార్క'' టీజర్

ఫైర్ బ్రాండ్ గా కనిపించే రోజా జీవితంలో ఇంత ఆవేదన ఉందా అని నెటిజన్లు ఫీలయ్యారు. వెండితెర‌పై  వినోదం పంచుతూ, న‌వ్వులు కురిపిస్తూ ఉండే సెల‌బ్రిటీల జీవితాల్లోనూ ఏన్నో విషాద ఘటనలు ఉంటాయని..వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తెరపై అలరిస్తారంటున్నారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి స్టార్ హీరోల‌తో న‌టించిన రోజా త‌న న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌తో ఎంత‌గానో ఆకట్టుకుంది. చిరంజీవితో స‌రిస‌మానంగా డ్యాన్స్ చేయ‌గ‌ల‌ద‌ని పేరు తెచ్చుకున్న రోజా కొన్నాళ్లకు సినిమాలు వ‌దిలేసి ప్ర‌స్తుతం బుల్లితెర కార్య‌క్ర‌మాల‌కు జడ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూనే..మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ సత్తా చాటుతున్నారు.

Also Read: షారుఖ్ ఖాన్ తో నయనతార, ప్రియమణి..ఎట్టకేలకు బాలీవుడ్ లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్

Also Read: ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పూర్తైందని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు..మరి తారక్-చెర్రీకి జక్కన్న ఎందుకు కబురుపెట్టినట్టు..

Also Read: కళ్లజోడు జారకుండా.. దుమ్ము దులిపేస్తున్న ‘టక్ జగదీష్’ సాంగ్.. దర్శకుడు అడ్డంగా బుక్కయ్యాడు!

Also Read:వామ్మో ఎంత హాటో...ఐదు పదులకు చేరువవుతున్నా మతిపోగొట్టేస్తున్న మలైకా...

Continues below advertisement