‘నిన్నుకోరి’, ‘మజిలీ’ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించిన ‘టక్ జగదీష్” పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు చూస్తామా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ పాటని చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ పాడటం విశేషం.
తాజాగా విడుదలైన పాటకి దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించడమే కాకుండా స్వయంగా పాడారు. 'సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు.. నువ్ గిల్లి గిచ్చి రెచ్చగొడితే వచ్చి దంచుతాడు.. నాజూకు నవ్వులోన జారుకత్తి పదును సూడు..నీ దుమ్ము దులుపుతాడు జారకుండ కళ్లజోడు' అంటూ సాగిన ఈ పాట భలే ఉందంటున్నారు సంగీత ప్రియులు. శివ నిర్వాణ వాయిస్ ఈ జోనర్ పాటకు బాగా సూట్ అయిందంటున్నారు నాని అభిమానులు. తొలుత ఈ పాటను దర్శకుడు, సంగీత దర్శకుడు హీరో నానితో పాడించాలనుకోగా.. నాని మాత్రం దర్శకుడు శివ నిర్వాణను అడ్డంగా బుక్ చేసినట్లు ఈ పాట ప్రారంభంలో చూపించారు. నాని కోరిక మేరకు శివ పాటను చక్కగా ఆలపించారు.
Also read: ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే.. వాళ్లిద్దర్నీ కూడా కలిపేసుకున్నారు..
ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిందిన ‘టక్ జగదీష్’ కరోనా పరిస్థితుల కారణంగా ఓటీటీలో విడుదలవుతోంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న స్ట్రీమింగ్ కానుంది. 'వి' తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతున్న నాని రెండో సినిమా ఇది. 'టక్ జగదీష్' చిత్రంలో నాజర్, జగపతిబాబు, నరేశ్, రావురమేశ్ కీలకపాత్రలు పోషించారు. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్స్. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు. అయితే తాజాగా విడుదలైన పాటకి మాత్రం గోపీసుందర్ స్వరాలు అందించాడు.
Also Read: భీమ్లా నాయక్ పాటపై వివాదం.. ఐపీఎస్ అధికారి ఆగ్రహం, మా సేవలను మరిచిపోయారు!
Also Read: ‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్!
Also Read: గుర్రం చనిపోయిందని డైరెక్టర్ మణిరత్నంపై కేసు
Also Read: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన
Also Read: ‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్!