టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం కేసు. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు ఎవరిపైనా ఆధారాల్లేవని టాలీవుడ్ తారల పేర్లను కూడా చార్జిషీట్లో పెట్టని కేసు. మరి ఇలాంటి కేసు ఒక్క సారిగా ఎందుకు తెరపైకి వచ్చింది..?. ఈడీ ఎందుకు దూకుడుగా ఉంది.  ఈ డౌట్లు అన్నీ అందరికీ వస్తున్నాయి. అయితే సమాధానాలు మాత్రం హీరోయిన్ పూనంకౌర్‌కు తెలుసు. నిజమే ఈ విషయాన్ని ఆమె ప్రకటించారు. తనకు ప్రస్తుతం సంచలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో కీలకమైన విషయాలు తెలుసని ప్రకటించారు. ఇదంతా రాజకీయం అని కూడా అంటున్నారు. 


డ్రగ్స్‌ అనేది కేవలం సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. సరిహద్దు సమస్య. పొలిటికల్‌ అజెండాతో జరుగుతున్న వ్యవహారం. బలమైన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే నా స్వీయ అనుభవాలను మీతో పంచుకుంటాను అని పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం పూనమ్‌ చేసిన ఈ ట్వీట్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఆ రాజకీయం ఏమిటి..?  టాలీవుడ్‌ను ఎవరు టార్గెట్ చేశారు..? ఇవన్నీ పూనమ్‌కౌర్‌కి ఎలా తెలుసు..? లాంటి ప్రశ్నలతో  టాలీవుడ్‌లో ఉన్న చిన్నా పెద్దా అందరి మైండ్ పజిల్‌గా మారిపోతోంది. 






టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారం ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, హీరోయిన్స్‌ చార్మీ, రకుల్‌ ఈడీ విచారణ పూర్తయింది. కెల్విన్ అనే డ్రగ్ పెడ్లర్ అప్రూవర్‌గా మారారని ఆయన మొత్తం సమాచారం ఇచ్చారని ఈడీ వర్గాలు మీడియాకు లీక్ చేశాయి. ఇంకా  రానా దగ్గుబాటి, రవితేజతోపాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌, నవ్‌దీప్, ఎఫ్‌ క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌, నందు, తరుణ్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించాల్స ిఉంది.  విచారణలో భాగంగా మరికొంత మంది నటీనటుల పేర్లు సైతం బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 


Also Read : ఎఫ్‌ క్లబ్ చుట్టూనే డ్రగ్స్ కేసు


మరో వైపు అసలు డ్రగ్స్ వాడారా లేదా అన్నది కాకుండా మనీలాండరింగ్ కోణంలోనే ఈడీ ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నగదు లావాదేవీలను బయటకు తీసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ అంశంపై ఈడీ ఎలాంటి వివరాలు బయటపెడుతుందో.. పూనంకౌర్ బ్యాక్ గ్రౌండ్ విషయాలు ఏమి చెబుతుందో కానీ ముందు ముందు మరిన్ని సంచలన విషయాలు మాత్రం బయటకు రానున్నాయని అర్థం చేసుకోవచ్చు. 


Also Read : అమెజాన్‌ను మోసం చేయడమే వాళ్ల వ్యాపారం