దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమీ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్ ఇండియాలో లాంచ్ అయ్యాయి. వీటి పేరు రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో. రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఇవి దేశీయ మార్కెట్లోకి విడుదల అయ్యాయి. చైనాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన రెడ్‌మీ ఎయిర్ డాట్స్ 3కి రీబాడ్జ్ వెర్షెన్‌గా వీటిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS)ఇయర్‌బడ్స్‌గా ఇవి విడుదలయ్యాయి. వీటిలో డ్యూయల్ డ్రైవర్లతో ఇది రానుంది. వీటి బ్యాటరీ లైఫ్ 30 గంటల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఇందులో స్వెట్ (చెమట) రెసిస్టెంట్ ఫీచర్ ప్రత్యేకంగా అందించారు. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‌లు క్వాల్‌కామ్ యాప్ట్ఎక్స్ (aptX) అడాప్టివ్ కోడెక్‌ను సపోర్టు చేస్తాయి. ఎంఐయూఐ ఫోన్లతో త్వరగా కనెక్ట్ అయ్యేలా ప్రత్యేక ఫీచర్ అందించారు. కనిష్ట లేటెన్సీ రేటు 86 మిల్లీసెకన్లుగా ఉంది. ఇవి వన్‌ప్లస్ బడ్స్ జెడ్, రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో ధర..
రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో ధర రూ.2999గా (ఎంఆర్పీ రూ.5,999) ఉంది. ఇవి నలుపు, పింక్, తెలుపు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటి సేల్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్, ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోం స్టోర్స్, రిటైలర్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో స్పెసిఫికేషన్లు..
రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో డైనమిక్ డ్రైవర్లతో రానున్నాయి. వీటిలో క్వాల్‌కామ్ క్యూసీసీ 3040 ప్రాసెసర్ ఉంటుంది. బ్లూటూత్ వీ5.2 ద్వారా కనెక్ట్ అవుతాయి. యాప్ట్ఎక్స్ అడాప్టివ్ కోడెక్ సపోర్టుతో రానున్నాయి. వాయిస్ కాల్స్ ఆపరేట్ చేయడానికి టచ్ కంట్రోల్ అందించారు. ఈ టచ్ కంట్రోల్స్ ద్వారా మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆపరేట్ చేయవచ్చు. అలాగే వాయిస్ అసిస్టెంట్‌ను ఎనేబుల్ చేయవచ్చు.
మనం చెవిలో నుంచి ఇయర్‌బడ్స్ తీయగానే ప్లే అవుతున్న పాటలను ఆటోమెటిగ్గా ఆపేందుకు (pause) ప్రత్యేకంగా ఐఆర్ (ఇన్ ఫ్రారెడ్) సెన్సార్లను అందించారు. ప్రతి ఇయర్‌బడ్ 43 ఎంఏహెచ్ లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ పెడితే 7 గంటల ప్లేబ్యాక్ టైం అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇక చార్జింగ్ కేసు 600 ఎంఏహెచ్ లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీతో రానుంది. దీని ప్లేబ్యాక్ సమయం 30 గంటలుగా ఉంది.
ALso Read: OnePlus Buds Pro: వన్‌ప్లస్ నుంచి బడ్స్ ప్రో .. ఫీచర్లు ఇవే..