ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ 10 ప్రైమ్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈరోజు (సెప్టెంబర్ 3) మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ 10 ప్రైమ్‌ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బిగ్ బ్యాటరీ ఉంది. గత నెలలో గ్లోబల్ మార్కెట్లో ఎంటర్ అయిన రెడ్‌మీ 10 ఫోన్‌కు రీబాడ్జెట్ వెర్షన్ గా రెడ్‌మీ 10 ప్రైమ్‌ ఇండియాలో విడుదల అయింది. దీనిలో మీడియాటెక్ హీలియో జీ88 SoC ప్రాసెసర్ అందించారు.


రెడ్‌మీ 10 ప్రైమ్‌ స్పెసిఫికేషన్లకు సంబంధించి షియోమీ గ్లోబల్ వీపీ మను కుమార్ జైన్ సైతం పలు ట్వీట్లు చేశారు. గతంలో షియోమీ నుంచి వచ్చిన ఫోన్లలో బ్యాటరీతో పోలిస్తే రెడ్‌మీ 10 ప్రైమ్‌ లో అందించిన బ్యాటరీ తక్కువ బరువును కలిగి ఉంటుందని చెప్పారు. ఇది రివర్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్టుతో రానుంది. 




రెడ్‌మీ 10 ప్రైమ్ ధర.. 


రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు. ఆస్ట్రల్ వైట్, బైఫోస్ట్ వైట్, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. వీటి సేల్ ఈ నెల 7 నుంచి ప్రారంభం కానుంది. HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.750 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 


రెడ్‌మీ 10 ప్రైమ్ ఫీచర్లు.. 
డ్యూయల్ సిమ్ రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అందించారు. రిఫ్రెష్ రేట్ 90 HZగా ఉంది. 20:9 యాస్పెక్ట్ రేషియా అందించారు. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. ఇందులో కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్ ఉంటుంది. 


వెనుక వైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. మెయిన్ కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా.. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ అందించారు. సెల్ఫీల కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో పాటు 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంది. దీంతో పాటు 22.5 వాట్స్ చార్జర్, 9 వాట్స్ రివర్స్ చార్జింగ్ అందించారు.





Also Read: Telegram 8.0 Update: టెలిగ్రామ్‌లో కొత్త అప్‌డేట్.. అన్‌లిమిటెడ్ లైవ్ స్ట్రీమింగ్, స్టిక్కర్స్ ఇంకా ఎన్నో..