పుస్తెలు అమ్మి పులస పులుసు తినాలి అంటుంటారు గోదారోళ్లు. నిజమేనండి మరీ... పులస చేపల పులుసు అంత అదుర్స్. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ కావాలంటారు మరీ ఆయ్... రుచికి అద్భుతమైన పులస ధరలో కూడా అదరహో అనిపిస్తుందండి. వర్షాకాలం మాత్రమే దొరికే పులస కోసం రూ. వేల నుంచి లక్షలు పెడతారంటే అతిశయోక్తి కాదండోయ్.
ఒడిశా పులసలు
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో సుమారు రెండు కేజీలకు పైగా బరువు ఉన్న గోదావరి పులసలు రెండు వలకు చిక్కాయి. అరుదుగా దొరికే ఈ పులసను సొంత చేసుకునేందుకు ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. వరద ప్రవాహానికి ఎదురీదే పులస చేపలు సముద్రం నుంచి గోదావరి నదిలోకి వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఈ ఏడాది ఇప్పటికే సగం పులసలు రావలసి ఉండగా ప్రస్తుతం వాటి జాడ అంతగా లేదు. ఇటీవల గోదావరి పులసల పేరుతో పలుచోట్ల ఒడిశా నుంచి వచ్చిన పులసల అమ్మకాలు జోరుగా సాగాయి. ప్రస్తుతం గోదావరిలో మత్స్యకారులు వేటకు వెళితే వారంలో ఒకటి లేదా రెండు చొప్పున పులసలు వలలో పడుతున్నాయి.
రూ.25 వేల ధర
యానాం గౌతమీ గోదావరీ వద్ద ఉన్న మార్కెట్ లో గోదావరి సెనా పులస ఒకటి అమ్మకానికి వచ్చింది. రెండు కేజీల బరువు ఉన్న చేప రూ.20 వేలు పలికింది. తాజాగా మరో రెండు పులసలు మరింత రేటు పలికాయి. యానాం మార్కెట్ వద్దకు గోదావరి పులసలు రెండు రావడంతో పులస ప్రియులు కొనడానికి ఎగబడ్డారు. వీటిల్లో ఒకటి రూ.25 వేలు, మరొకటి రూ.23 వేల ధరకు అమ్ముడయ్యాయి. రెండు కేజీలకు పైగా బరువున్న చేపను కొల్లు నాగలక్ష్మీ రూ.23 వేలకు, మరో చేపను పట్టా భాగ్యలక్ష్మీ రూ.25 వేలకు సొంతం చేసుకున్నారు.
Also Read: Viral Video: నెల్లూరులో వియ్యంకుల మధ్య వివాదం... ఇటుకలతో దాడి... వైరల్ గా మారిన దృశ్యాలు
ఎందుకంత రుచి...
గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. సముద్రంలో ఉండే ఇలస. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. ప్రతి సీజన్లో పులస చేపల వ్యాపారం కోట్లల్లో జరుగుతుంది.
Also Read: Llish Fish: ఏండే పుస్తెలమ్మైనా.. పులస తినాల్సిందేనండి.. ఆయ్