మూగ జీవాలని షూటింగ్ సమయంలో ఎలాంటి చిత్ర హింసలకు గురి చేసినా కఠిన శిక్షలు అమలు చేస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రీకరణలో ఓ గుర్రం మరణించడంతో కేసు నమోదు చేశారు. పెటా ఇండియా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు గుర్రం యజమానిపై పిసిఎ చట్టం, 1960 సెక్షన్ 11, 1860 ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్ 429 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన
మూవీ టీమ్ సుమారు 40 నుంచి 50 గుర్రాలను తీసుకొచ్చి వాటితో షూటింగ్ నిర్వహిస్తుండగా, ఓ గుర్రం మృతి చెందింది. గుర్రం అనారోగ్యంతో ఉన్నా దాన్ని మరో గుర్రంతో ఢీకొట్టే దృశ్యాన్ని చిత్రీకరించడం వల్లే చనిపోయిందన్నారు. మూగ జీవాల పట్ల క్రూరంగా వ్యవహరించరాదని,ఇలాంటి చర్చలు భవిష్యత్‌లో మళ్లీ జరగకూడదని, సంబధిత దోషులకు శిక్ష పడాలని యానిమల్ వేల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధికారులని కోరింది. గుర్రం డిహైడ్రేట్ కు గురయ్యిందని, అయినప్పటికీ దానిని షూటింగ్ లో ఉపయోగించడం వల్ల ప్రాణాలు కోల్పోయిందని పెటా ఇండియా ఆరోపించింది. నిజమైన జంతువులను ఉపయోగించకుండా, కంప్యూటర్ గ్రాఫిక్స్ లను వాడాలని అందరూ చిత్రనిర్మాతలకు కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని పెటా ఇండియా అన్ని జంతు సంక్షేమ బోర్డులను అభ్యర్థించింది. గుర్రం చనిపోవడానికి చోటుచేసుకున్న సంఘటన దృశ్యాలు, వీడియోలు, ఫొటోలు ఏమైనా ఉంటే వాటిని పెటాకు పంపిస్తే వారికి 25 వేల నగదును అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.మరి ఈ కేసుపై మణిరత్నం ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇక “పొన్నియిన్ సెల్వన్” విషయానికొస్తే కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా మణిరత్నం రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, ఐశ్వర్య లక్ష్మి, త్రిష, ప్రభు, ప్రకాశ్ రాజ్ శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, కిషోర్, జయరామ్ నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్.. నాడు బాలీవుడ్.. నేడు టాలీవుడ్ కేసులో!
Also Read: ‘బిగ్‌బాస్’ విన్నర్ మృతిపై సందేహాలు.. ఆ రాత్రి ఏం జరిగింది? పోలీసులు ఏమన్నారంటే..
Also Read: ఆర్జీవీ చెంప పగలగొట్టిన అషూ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్.. వర్మ మళ్లీ తెగించారు