Ashu Reddy Slaps RGV: ఆర్జీవీ చెంప పగలగొట్టిన అషూ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్.. వర్మ మళ్లీ తెగించారు

‘అషూ రెడ్డి బోల్డ్ ఆర్జీవీ’ పేరుతో రామ్ గోపాల్ వర్మ మరో ఇంటర్వ్యూతో అభిమానుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ చెంప దెబ్బలు కూడా తిన్నారు.

Continues below advertisement

రామ్ గోపాల్ వర్మ (RGV) అంటేనే వివాదాలకు చిరునామా. ఆయన ఉదయాన్నే బ్రష్ చేసుకోవడం మరిచిపోతారేమో గానీ.. రోజూ ఏదో ఒక వివాదంతో వార్తలో ఉండటం మాత్రం మరిచిపోరు. ఒకప్పుడు ఆయన సినిమాలు గురించి అంతా మాట్లాడుకొనేవారు. వర్మ ఎంత చక్కగా తీశాడని ప్రశంసల వర్షం కురిపించేవారు. వర్మకు ఉన్న టాలెంట్ ఇండియాలో మరే దర్శకుడికి ఉండదని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకొనేవారు. కానీ, ఇప్పుడు ఉన్నది అప్పటి వర్మ కాదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటారు. ఆయన ఆర్జీవీ అంటే అర్థమే మార్చేశారు. ఇప్పుడు R అంటే రచ్చ, G అంటే గొడవ, V అంటే వివాదం. 

Continues below advertisement

ఇప్పుడు ఆర్జీవిని ఇంటర్వ్యూ చేయాలంటే లేడీ యాంకర్లు హడలిపోతున్నారు. నిండుగా బట్టలేసుకుంటేనే కళ్లతో స్కాన్ చేసే వర్మ ముందు.. కాస్త మోడ్రన్ డ్రెస్ వేసుకున్నా.. అంతే సంగతులని భయపడుతున్నారు. దీంతో వర్మకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే, దీన్ని కొన్ని యూట్యూబ్ చానెళ్లు బాగానే సొమ్ము చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ‘బిగ్ బాస్’ బ్యూటీ అరియానా.. అందాల ఆరబోతతో వర్మను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. పచ్చి మాటలతో వర్మ.. ఇంటర్వ్యూలను సైతం ‘పెద్దలకు మాత్రమే’ అనేలా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతికి మరో ‘బిగ్ బాస్’ బ్యూటీ అషు రెడ్డి చిక్కింది. ఇంకేముంది వర్మ మరోసారి అరచకానికి తెర తీశారు. ‘అషూ రెడ్డి

ఆర్జీవీ గురువారం అషు రెడ్డితో తన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ప్రోమోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో వర్మ స్టైల్‌గా కారు నుంచి దిగి.. ఐస్ క్రీమ్ పార్లర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఫోన్ చూస్తూ సెల్ఫీలు తీసుకుంటున్న అషు రెడ్డిని చూసి.. నన్న గుర్తుపట్టావా? నేను రామ్ గోపాల్ వర్మ అని చెబుతారు. అతను ఎవరో తెలియనట్లు నటిస్తున్న అషూరెడ్డి కాళ్ల వైపు చూసి.. మీ *** బాగున్నాయని చెబుతారు. దీంతో అషూ వాట్ ద **** అంటూ ఆర్జీవీ చెంప చెళ్లుమనిపిస్తుంది. మొత్తానికి ఈ ప్రోమో చూస్తే.. ఇద్దరు తమ పాత్రల్లో చాలా ఎక్కువ జీవించేసినట్లు అర్థమవుతుంది. ఇక ఆర్జీవీ అభిమానులు ఊరుకుంటారా.. అదే పనిగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ సెప్టెంబరు 7న ప్రసారం కానున్నట్లు ఆర్జీవీ ఈ ప్రోమోలో తెలిపారు. ఇది పవన్ కళ్యాణ్‌కు అషూ రెడ్డి ఇస్తున్న గిఫ్ట్ అని చివర్లో పేర్కొన్నారు. అషూరెడ్డి పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు గిఫ్ట్‌గా వర్మ చెంప పగలగొట్టిందని చెప్పే ప్రయత్నంతో ఈ ప్రోమో విడుదల చేసినట్లు అర్థమవుతుంది. ప్రొమోయే ఇలా ఉంటే.. ఇక ఇంటర్వ్వూ మొత్తం ఎలా ఉంటుందో. 

ఫ్రోమో వీడియో:

Also Read: పవర్ స్టార్ @ 50: బాల్యం నుంచి నేటి వరకు.. పవన్ కళ్యాణ్ అరుదైన చిత్రాలు

Also Read: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!

Continues below advertisement