ఓ వ్యక్తిని సరైన మార్గంలో తీసుకెళ్లడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది. అందుకే ఉపాధ్యాయ దినోత్సవం అంటే అందరికీ చాలా స్పెషల్. మన ఉన్నతికి శ్రమించిన ఉపాధ్యాయులను స్మరించుకోవడం అందరి బాధ్యత కూడా. ఒకప్పుడు టీచర్స్‌ డే అంటే ఇష్టమైన గురువుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు  కాలం మారింది. కాలంతోపాటు గురువులకు ఇచ్చే గిప్టుల్లోనూ మార్పు వచ్చింది. మీకు ఇష్టమైన ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే బహుమతులను చూసేయండిక్కడ.


టీచర్స్‌ డే కుషన్ అండ్ మగ్‌ సెట్‌: ఇది చాలా మందికి నచ్చే కామన్‌ గిఫ్టు. ఇందులో మగ్‌, కుషన్, కీచెయిన్, ఓ గ్రీటింగ్ కార్డు ఉంటాయి. మీరు ఇచ్చే కుషన్ టీచర్‌ బెడ్‌ రూం డెకరేట్ చేసుకునేందుకు యూజ్ అవుతుంది. మార్నింగ్ తాగే టీ కోసం టీ మగ్‌ కూడా ఉంటుంది. అందులో ఉండే గ్రీటింగ్‌ కార్డులో టీచర్‌పై మీకున్న అభిమానాన్ని తెలిపేలా ఏదైనా రాయొచ్చు కూడా.


టీచర్స్‌ డే ఫొటో ఫ్రేమ్‌: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్స్‌కు ఇవ్వదగ్గ మరో బహుమతి ఫొటో ఫ్రేమ్‌. దీన్ని టీచర్స్‌ కోసం స్పెషల్‌గా డిజైన్ చేశారు. దీన్ని మీ టీచర్స్‌ గోడలకు వేలాడదీసి... వాళ్లకు నచ్చిన ఫొటోలు పెట్టుకుంటారు. టేబుల్‌పై కూడా పెట్టుకునే వెసులుబాటు దీనికి ఉంది. ఈ ఫ్రేమ్‌తోపాటు టీచర్స్‌తో మీ క్లాస్‌ ఫ్రెండ్స్‌ అంతా కలిసి దిగిన ఫొటోను అందులో పెట్టి పంపించ వచ్చు.


టీచర్స్‌ డే గడియారం : మరో అద్భుతమైన బహుమతి ఈ-వాల్ క్లాక్‌. మీ టీచర్‌ ఇంట్లో మరో అందమైన డెకరేషన్ ఐటెమ్‌గా ఈ వాల్‌ క్లాక్‌ను ఉంచుకుంటారు. ఈ గడియారం చూసినప్పుడల్లా మీరు గుర్తొస్తుంటారు. అందుకే టీచర్స్‌ డే సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చే బహుమతుల్లో ఇది చాలా విలువైనది.


టీచర్స్‌ డే పెన్ స్టాండ్: మీ ప్రియమైన ఉపాధ్యాయులకు పెన్‌ స్టాండ్ కూడా మరో విలువైన బహుమతి ఇవ్వొచ్చు. ఇది చెక్కతో సుందరంగా ముస్తాబు చేసిన చూడముచ్చటైన గిఫ్టు.


గుడ్‌ లక్‌ ప్లాంట్: టీచర్స్‌ డే సందర్భంగా నచ్చిన ఉపాధ్యాయులకు గుడ్‌లక్‌ ప్లాంట్స్‌ కూడా ఇవ్వొచ్చు. ఇప్పుడు ఇది ట్రెండీ కూడా. చాలా మంది పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు, వార్షికోత్సవాలకు వీటినే గిఫ్టులగా ఇస్తున్నారు. అందుకే ఇలా కూడా మీరు ట్రై చేయండి.


భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్‌ 1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్‌ పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.