ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అంశంపై దాగుడు మూతలు ఆడుతోంది. ఏపీ ఈ గెజిట్‌లో జీవోలను అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించింది. కానీ రోజుకు రెండు, మూడు జీవోలను కూడా అందులో ఉంచడం లేదు. జీవోలను రహస్యంగా ఉంచడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 100 గురించి న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో విచారమ ఉందనిచెప్పే ఆ జీవో జారీ చేశారని అందులో సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ పేరిట జీవోలను రహస్యంగా ఉంచేందుకు వెసులుబాటు కల్పించుకున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. Also Read : అమరావతి అసైన్డ్ ప్లాట్లు దళిత రైతులవే..!
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4, 8కు జీవో విరుద్ధంగా ఉందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రహస్యం పేరిట జీవోలను పెట్టకపోవడం ఏంటని హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పిటిషనర్లు తాజా పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ప్రభుత్వం కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయన్న కారణంగా ఆగస్టు 16వ తేదీన ఏపీ ప్రభుత్వం జీవోలన్నింటినీ రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. మాన్యువల్ పద్దతిలో జీవోల రిజిస్టర్ నిర్వహించాలని ఆన్ని శాఖలనూ ఆదేశించారు. అప్పటి నుండి ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో జీవోలు అప్ లోడింగ్ నిలిపివేశారు. Also Read : మటన్ మార్టులు ఉన్నాయా ..? లేవా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలన్నీ రహస్యంగా ఉంచాలని నిర్ణయించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా డీవోను ఏపీ ఈ గెజిట్‌లో పెడుతున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు జీవో నెంబర్ 100ను జారీ చేసింది. అయితే ఆ జీవో కూడా ప్రజలకు అందుబాటులో లేదు. సమాచార హక్కు చట్టం కింద ఆ జీవోను సేకరించిన వారికి అందులో ఉన్న అంశాలు తెలుసుకుని విస్మయానికి గురయ్యారు. మొత్తం జీవోలను వర్గీకరించారు. అందులో సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ కేటగిరీల కింద ఉన్న వాటిని రహస్యంగా ఉంచాలని నిర్ణయంచారు. ఆ కేటగిరీ పోను రోజుకు రెండు, మూడు జీవోలు కూడా ఉండటం లేదు. ఉన్న వాటినే ఈ గెజిట్లో పెడుతున్నారు. Also Read : టీడీపీ వర్సెస్ టీడీపీ
ప్రజలకు అవసరమైన జీవోలను మాత్రమే పెడతామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఆ ఒకటి, రెండు జీవోలు మినహా మిగతా ఏవీ ప్రజలకు అవసరం లేదేమోనని ప్రభుత్వం అనుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీవోలను రహస్యంగా ఉంచరాదని .. ప్రజలకు అందుబాటులో ఉంచాలని గతంలో పలు హైకోర్టులు తీర్పులు చెప్పాయి. అంతే కాకుండా జీవోలను రహస్యంగా ఉంచితే సమాచార హక్కు చట్టం ఉల్లంఘనేనన్న అభిప్రాయం కూడా ఉంది. Also Read : టీటీడీ అగరబత్తీల బ్రాండ్లు ప్రారంభం.. ధరెంతో తెలుసా..