వినాయకచవితి వచ్చిందంటే వీధులు, ఊళ్లు గణేశ మండపాలతో కళకళలాడిపోయేవి. కరోనా కారణంగా ఉన్న నిబంధనలతో ఈసారి ఆ కళ కాస్త తప్పింది. అంతేకాదు చాలామంది పర్యావరణహిత వినాయకుల ఏర్పాటు వైపు మొగ్గుచూపుతున్నారు. లూథియానాకు చెందిన ఓ రెస్టారెంట్ యజమాని పూర్తిగా చాకోలెట్ తో  వినాయకుడిని తయారు చేశారు. 


రెండు వందల కిలోల బెల్జియన్ చాకోలెట్ తో దాన్ని రూపొందించారు. దాదాపు 10 రోజుల పాటూ పది మంది చెఫ్ లు కలిసి  దీన్ని తయారుచేశారు.  ఈ గణేషుడిని చూసిన వాళ్లందరికీ ఒకటే సందేహం... ఆ చాకోలెట్ గణేషుడిని చివరికి ఏం చేస్తారు? అని. దానికి ఆ రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ ‘ఈ గణేషుడిని పాలల్లో నిమజ్జనం చేస్తాం. చాకోలెట్ పూర్తిగా కరిగాక అది ఎన్నో పోషకాలున్న మిల్క్ షేక్ గా మారిపోతుంది. దాన్ని పేదరికంతో బాధపడుతున్న పిల్లలకు పంచిపెడతాం’ అని చెప్పారు.  ఈ రెస్టారెంట్ వాళ్లు గత ఆరేళ్లుగా చాకోలెట్ గణేషుడిని తయారుచేస్తున్నారు. ఎకోఫ్రెండ్లీ విధానంలో మాత్రమే వాళ్లు గణేషుడిని నిర్మించాలనే పిలుపును ఇస్తున్నారు  ఆ హోటల్ యజమాని హర్జిందర్ సింగ్ కుక్రేజా. 



Also read: సోంపు నీళ్లతో బరువు తగ్గుతారా? నిజమేనా?


Also read: గుడ్లు తిన్నాక... వీటిని తినకండి, తింటే ఏమవుతుందంటే...


Also read: ఆమె చదివింది ఎమ్మెస్సీ... చేసేది రోడ్లు ఊడ్చేపని


Also read: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...


Also read: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...