చైనాలోని జెంజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఒక తల్లి.. తన కుమార్తె పొడవుగా ఎదగడానికి వ్యాయామం చేయించాలని నిర్ణయించుకుంది. అయితే దీని కోసం రోజుకి 3 వేల సార్లు జంపింగ్ రోప్ చేయించేది. ఇప్పుడు అదే వారి కొంప మునిగేలా చేసింది.
బలవంతంగా జంపింగ్ రోప్
బెంజియాంగ్ ప్రావిన్స్ లో హాంగ్‌జౌకు చెందిన 13 ఏళ్ల బాలిక మోకాలు నొప్పితో బాధపడుతుంది. దీనికి కారణం తన తల్లే. బాలిక తల్లి బలవంతంగా తాడుతో జంపింగ్ రోప్ చేయించేది. తన కీళ్ళు నొప్పిగా ఉన్నాయని ఆ అమ్మాయి తన తల్లికి చాలాసార్లు ఫిర్యాదు చేసింది. కానీ.. తల్లి ఎత్తును పెంచే విషయంపై మాత్రమే శ్రద్ధ పెట్టేది. పైగా కావాలనే తన కుమార్తె అలా చేస్తుందని తిట్టేది. బద్ధకంతో ఇలా చేస్తుందని అనుకునేది.
కీళ్ల నొప్పులు అని బాలిక చెప్పినా...
చైనా మీడియా కథనం ప్రకారం 13 ఏళ్ల అమ్మాయిని తన తల్లి ప్రతిరోజూ 3000 సార్లు జంప్ రోప్ చేయమని చెప్పేది. అలా చేస్తుంటే ఆ అమ్మాయికి మోకాళ్ల నొప్పులు వచ్చాయి. ఇదే విషయాన్ని తల్లికి చెప్పింది. కానీ అమ్మాయి సోమరితనంగా కావాలనే ఇలా చెబుతుందని ఆ తల్లి అనుకునేది. అసలు వినకుండా ఆమె వ్యాయామ షెడ్యూల్‌ను కొనసాగించింది.
వైద్యుడిని సంప్రదించలేదు
యువాన్యువాన్ అనే ఈ అమ్మాయి కాస్త బరువు ఎక్కువగా ఉండేది. తల్లి చెప్పిన వ్యాయామాన్ని ప్రతిరోజూ చేయడం ద్వారా ఆమె పెరిగిన బరువు తగ్గింది. అయితే ఎత్తు కూడా పెరగాలని తల్లి ఈ వ్యాయామం చేయించేది. దీని కోసం, తల్లి ఏ వైద్యుడిని సంప్రదించలేదు. అమ్మ చెప్పంది నమ్మిన కుమార్తె.. వ్యాయామాన్ని చేసింది. అంతకుముందు ఆమెను 1000 సార్లు స్కిప్పింగ్ చేయమని చెప్పేది. త్వరగా.. పొడవు పెరగాలని 3 వేలకు పెంచింది.
అధిక వ్యాయామం వల్లే
3 నెలలు ఇలానే ప్రతిరోజు 3 వేలసార్లు జంపింగ్ రోప్ చేసిన తర్వాత యుయాన్యువాన్ తన మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయని, తన తల్లికి చెప్పింది. ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లినప్పుడు, ఆ అమ్మాయికి ట్రాక్షన్ అపోఫిసిటిస్ వచ్చిందని చెప్పాడు. బాలికను చెకప్ చేసిన తర్వాత అధిక వ్యాయామం పిల్లలకు హానికరం అని డాక్టర్ తెలిపాడు. ఎక్కువగా స్కిప్పింగ్ చేయడం వల్ల పెద్ద సమస్యలు వస్తాయని డాక్టర్ అన్నాడు. గతంలో 10 ఏళ్ల బాలుడికి కూడా చైనాలో ఇలాంటి సమస్యే ఎదురైంది. కాలిమడమ నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. పిల్లల వ్యాయామంతో పాటు, వారి నిద్ర, పోషకాహారం, మానసిక స్థితి కూడా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Old Note: అబ్బా లక్కీ ఛాన్స్.. ఈ పది రూపాయలుంటే రూ.5 లక్షలు మీవే.. ఇక జేబులో వేసుకోవచ్చు