‘బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్’... అంటే విడివిడిగా చూస్తే ఆ ఆహారపదార్థాలు మంచివే, కలిపి తినడం లేదా, రెండూ ఒకే సమయంలో తినడం వల్ల మాత్రం శరీరానికి చేటు జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు గుడ్డుతో పాటూ తినకూడని ఆహారపదార్థాలేంటో తెలుసుకుందాం. 


1. పంచదార
గుడ్డుతో చేసన వంటకాలు తిన్నాక, పంచదార అధికంగా వేసి చేసిన ఏ ఆహారపదార్థాన్ని తినకూడదు. తింటే... గుడ్డు, పంచదార రెండింటి నుంచి అమినో ఆమ్లాలు అధిక మొత్తంలో విడుదలవుతాయి. దీనివల్ల రక్తంలో చిన్న చిన్న గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. కనుక గుడ్డు తిన్నాక కనీసం గంట, గంటన్నర గ్యాప్ ఇచ్చి పంచదారతో చేసిన తీపిపదార్థాలు తినడం మంచిది. 


2. సోయా పాలు
సోయా పాలు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఆరోగ్యకరమైనవి. అయితే గుడ్లు తిన్నాక సోయాపాలు తాగడం లేదా, సోయాపాలు తాగాక, గుడ్లు తినడం చేయద్దు. దీనివల్ల శరీరం ప్రోటీన్లను శోషించుకునే శక్తి తగ్గిపోతుంది. 


3. చేపలు
చేపల వేపుడు, కూర, పుసులు ఏదైనా తిన్నాక... గుడ్లు తినకపోవడం మంచిదంటున్నారు న్యూట్రిషనిస్టులు. దీని వల్ల కొందరిలో అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చని హెచ్చరిస్తున్నారు. 


4. పనీర్
చాలా మంది పనీర్, గుడ్లు కలిపి వండుతుంటారు. ఇలా వీటిని కలిపి వండి, తినడంవ వల్ల కూడా అలెర్జీ కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు శరీరంలో ఇతర చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. 


5. అరటి పండు
బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్లు తినే వాళ్లు, ఓ అరటి పండు కూడా తింటుంటారు. కానీ అలా తినడం శరీరానికి చేటు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం వ్యాయామాలు చేసేవాళ్లు ఈ రెండింటి కాంబినేషన్లో ఆహారాన్ని తీసుకోకూడదు. 


6. టీ
బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లును తినేవాళ్లు, ఆ వెంటనే ఓ టీ లేదా కాఫీని కూడా లాగించేస్తారు. కానీ ఈ కాంబినేషన్లోని ఫుడ్ మలబద్ధకానికి దారితీస్తుంది. ఒక్కోసారి పెద్ద సమస్యగా కూడా మారొచ్చు. 


గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. పలు అధ్యయనాల సమాచారాన్ని బట్టి అందించాం. 


Also read: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు


Also read: ఇవి తినడానికీ ఓ టైముంది... ఎప్పుడు తినకూడదంటే...


Also read: ముల్లంగి తినడం లేదా... మీకే నష్టం