Horoscope Today :ఈ రాశి ప్రేమికులకు కలిసొచ్చే రోజు…ఆ రాశుల వారికి అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త…మిగిలిన రాశుల వారి ఫలితాలు చూద్దాం..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

Continues below advertisement

2021 సెప్టెంబరు 13 సోమవారం రాశిఫలాలు

మేషం

మేషరాశివారు ఈ రోజు శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి.పెండింగ్‌లో ఉన్న ఏదైనా పని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు..అదే పూర్తవుతుంది.విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి.ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు.

Continues below advertisement

వృషభం

ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శుభ సమయం. మీరు చేసే ప్రతిపనిలోనూ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు.మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

మిథునం

డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు కలిసొచ్చే రోజు.  కొత్త పెట్టుబడులు పెట్టుకోవచ్చు. విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఉండొవచ్చు.

Also Read: ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందంటే..

కర్కాటక రాశి

అన్ని విషయాల్లో సానుకూలత ఉంటుంది. ఓ శుభవార్త వినే అవకాశం ఉంద. ఖ్యాతి పెరుగుతుంది.ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కార్యాలయంలో సాధారణ సాధారణ వాతావరణం ఉంటుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందే అవకాశ ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం

ఈ రోజంతా మీకు శుభఫలితాలే గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సామాజిక, కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది. వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కన్య

ఈ రోజు బాధ్యతలు మరింత పెరుగుతాయి. అనవసర ఖర్చులుంటాయి. విద్యార్థులు  చదువుపై శ్రద్ధపెట్టాలవి. ఏదో విషయంలో టెన్షన్ ఉండొచ్చు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. వీలైనంతవరకూ ప్రయాణాలకు దూరంగా ఉండండి.

Also Read: 'అఫ్గాన్'లో ఇక కో-ఎడ్యుకేషన్ బంద్.. తాలిబన్ల సంచలన ప్రకటన

తులారాశి

మీకు కలిసొచ్చే రోజుది. ఆర్థికంగా బలపడేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన వార్త వింటారు. కుటుంబ బాధ్యతలను సులువుగా నిర్వర్తించగలుగుతారు. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి.

వృశ్చికరాశి

బాధ్యతల నిర్వహణలో సోమరితనం వద్దు. ఆరోగ్యానికి సంబంధించి సమస్య ఉంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. కెరీర్లో మరో అడుగు ముందుకు పడే అవకాశాలు పెరుగుతాయి.

ధనుస్సు

మీకు మంచి రోజు. ఏదైనా కొత్తగా కొనుగోలు చేసే ఆసక్తి ఉంటే ప్రోసీడ్ అవండి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్యం బాగుంటుంది.

Also read: ఖబడ్దార్ కేసీఆర్! నీ దొర పోకడలు సాగనివ్వను, నీ మెదడు మత్తుతో మొద్దుబారిందా? వైఎస్ షర్మిల ధ్వజం

మకరం

చాలా రోజలుగా నిలిచిపోయిన పని పూర్తవుతుంది. ఈ రోజు కొత్తగా ఏదైనా చేయవచ్చు. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ పురోగమిస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. అన్నింటా కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.  వైవాహిక జీవితం బావుంటుంది.

కుంభం

కార్యాలయంలో కొత్త సమాచారం వింటారు. స్నేహితుడి భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రారంభించవచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించి ఆటంకాలు ఉండొచ్చు. కొత్త పనులపై ఆసక్తి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.

మీనం

చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు బదిలీలు ఉండొచ్చు. అనవసర వాదనలు ఉండే అవకాశం ఉంది..ఓపికగా వ్యవహరించండి.  పని విషయంలో టెన్షన్ ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి.

Also Read: ఈ 50 గ్రాముల డివైస్ మీ సాధార‌ణ‌ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది.. మ‌న‌దేశంలో లాంచ్!

Continues below advertisement
Sponsored Links by Taboola