ఇక్కడ చెప్పినవన్నీ పెద్దల నుంచి పిల్లల వరకు ఎవరు తిన్నా ఆరోగ్యాన్నందించేవే. కాకపోతే వీటిని రాత్రిపూట తినడం వల్ల చిన్నచిన్నఇబ్బందులు రావొచ్చు.

  


1. అరటి పండ్లు
వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక అరటిపండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటూ, చర్మం నిగనిగలాడుతుంది. కానీ అరటి పండుని రాత్రిపూట తినకూడదు. తింటే కొందరిలో అరగకపోవడం, కఫం పట్టడం లాంటి  సమస్యలు కలగవచ్చు. వర్కవుట్స్ చేయడానికి ముందు ఒక అరటిపండు తినడం మంచిదని సూచిస్తున్నారు పోషకాహారనిపుణులు. అలాగే ఉదయం పూట ఎప్పుడైనా అరటిపండుని తినొచ్చు. 
 
2. ఆపిల్   
ఆపిల్ పండ్లలో పెక్టిన్ ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తుంది. అందుకే రోజుకో ఆపిల్ తింటే వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదంటారు. కానీ రాత్రిపూట ఈ పండుని దూరం పెట్టాలి. ఎందుకంటే పెక్టిన్ జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది. రాత్రిపూట తింటే అరిగేందుకు చాలా సమయం పట్టి ఎసిడిటీ మొదలవుతుంది. 


3. అన్నం
శరీరానికి సరిపడా కార్బోహైడ్రైట్లు అందాలంటే అన్నం తినడం చాలా ముఖ్యం. అయితే బరువు తగ్గాలని భావించేవారు రాత్రిపూట అన్నం తినకూడదని సూచిస్తున్నారు డైటీషియన్లు. చపాతీ, పుల్కాలాంటి వాటితో సరిపెట్టుకోవాలని అంటున్నారు. డిన్నర్ లో తినే అన్నం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. 


4. మీట్
మాంసాహారం నుంచి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. త్వరగా నీరసం రాకుండా, వ్యాధుల బారిన పడకుండా రక్షణగా నిలుస్తాయి. కానీ ఏ మాంసాహారమైన అరగడానికి నాలుగు నుంచి ఆరుగంటలు పడుతుంది. కనుక రాత్రిపూట మాంసాహారానికి కూడా దూరంగా ఉండడం మంచిది. తిన్న వెంటనే నిద్రపోతే ఒంట్లో కొవ్వు చేరిపోతుంది. 


5. నట్స్
బాదం, పిస్తా, వాల్ నట్స్... చాలా బలవర్ధకమైన ఆహారాలు. రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచేందుకు, గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇవి సహకరిస్తాయి. కాకపోతే రాత్రిపూట తింటే మాత్రం బరువు  పెరగడం ఖాయం అంటున్నారు డైటీషియన్లు. బ్రేక్ ఫాస్ట్ సమయంలో వీటిని తింటే మంచిదని సూచిస్తున్నారు.  


6. డార్క్ చాకొలెట్
డార్క్ చాకొలెట్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బులను నిరోధించడంలో, అందం పెంచడంలో ఇవి ముందుంటాయి. ఇవన్నీ నిజమే కావచ్చు... కానీ రోజులో మూడు పూటలా తినకూడదు. అతిగా తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కనుక ఉదయం పూట చిన్నముక్క తింటే చాలు. మంచి ఫలితాలు వస్తాయి. 


7. పెరుగు
పెరుగు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ రాత్రిపూట తినడం వల్ల మాత్రం జలుబు, దగ్గు, కఫం పట్టడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సైనస్ వంటి సమస్యలు, తరచూ అలర్జీల బారిన పడే వారు రాత్రి పూట పెరుగుకు దూరంగా ఉండడమే మంచిది. 


Also read: ముల్లంగి తినడం లేదా... మీకే నష్టం


Also read: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు


Also read: ఉదయం లేచాడు.... భార్యాకూతురిని కూడా మర్చిపోయాడు... ఇదో వింత జబ్బు