ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటన్ మార్ట్ లు ఏర్పాటుచేస్తుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. మటన్‌ మార్ట్‌ల ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఆక్వాహబ్‌లు, స్పోక్స్, మినీ అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా మాంసపు ఉత్పత్తులను సర్టిఫై చేసి పరిశుభ్ర వాతావరణంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని శాఖాపరంగా ఆలోచన చేసినట్లు తెలిపారు. ఈ రంగంలో ఉన్న వారి ద్వారానే నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా రూపొందించిన మినీ రిటైల్‌ అవుట్‌ లెట్ల ద్వారా నాణ్యమైన మాంసపు ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని భావించినట్లు తెలిపారు.


Also Read: Sanwaliyaji Temple:ఈ దేవుడికి బిజినెస్ లో షేర్.. నమ్మట్లేదా.. ఆలయం డబ్బులతో నిండిపోతోంది తెలుసా?


అనవసర రాద్ధాంతం సరికాదు


ఈ రంగంలోనే ఉన్న వారికి సబ్సిడీలు ఇచ్చి వ్యాపారులుగా తీర్చిదిద్దాలని ఆలోచించినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఇది శాఖాపరమైన నిర్ణయమే తప్ప ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. దీనిపై సీఎం జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ఆక్వాహబ్‌ల మాదిరి నాణ్యమైన మాంసపు ఉత్పత్తుల విక్రయాల ద్వారా వాటికి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని ఆలోచన చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో పనిగట్టుకొని రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. 


Also Read: Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ


వైరల్ అయిన వార్తలు


ఏపీ ప్రభుత్వం మాంసం మార్టులు ఏర్పాటుచేస్తుందన్న వార్తలు వచ్చాయి. అందుబాటు ధ‌ర‌ల్లో ఆరోగ్యక‌ర‌మైన మాంసాహారాన్ని ప్రజలకు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో మాంసం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని ఓ పత్రిక కథనం రాసింది. ఏర్పాటుకు ప్రభుత్వం స‌న్నాహాలు చేస్తోందని, తొలి ద‌శ‌లో న‌గ‌రాలు, ప‌ట్టణాల్లో ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. మ‌లిద‌శ‌లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వీటిని విస్తరించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారని తెలిపింది. మ‌ట‌న్ మార్ట్‌ల్లో ఎన్నో ప్రత్యేక‌త‌లున్నాయ‌ని పేర్కొంది. 


Also Read: Amaravati HighcCourt : అమరావతి అసైన్డ్ రైతుల ప్లాట్ల స్వాధీనం చేసుకోవద్దు .. జీవో నెం.316పై హైకోర్టు స్టేటస్ కో !