మహమ్మారి సమయంలో మాంద్యం, నిధుల సంక్షోభం.. లాంటి ఎన్నో వారలు విన్నాం.. కానీ ఈ టెంపుల్ పై మాత్రం దాని ప్రభావం అస్సలు లేదు. ఇక్కడ డాలర్లు, రూపాయలు, బంగారంతో నిండిపోతుంది. ఆ ఆలయం.. రాజస్థాన్ చిత్తోర్ గఢ్ లో  శ్రీ సన్వాలియా సేథ్ ఉంది.


సన్వాలియాజి స్వామిని, చాలా మంది వ్యాపారులు తమ వ్యాపార భాగస్వామి అని నమ్ముతారు.   పెద్ద వ్యాపారవేత్తలు కానుకలు ఇచ్చే ముందు.. ఈ దేవాలయం గుమ్మం వద్ద తల వంచి సన్వాలియాజీని తమ భాగస్వామిగా భావిస్తారు. వారు లాభం పొందిన తర్వాత.. వారు తమ లాభాలలో కొంత భాగాన్ని దేవునికి సమర్పిస్తారు.


'ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి నాడు, అమావాస్యకు ఒక రోజు ముందు.. ఈ దేవాలయం విరాళ పత్రం తెరుస్తారు. ఇక్కడ అధికారికంగా విరాళాలు ప్రకటిస్తారు. మా బృందం 200 మంది ఉంటాం. కలెక్షన్లను లెక్కిస్తుంటాం. ఈసారి, కృష్ణ చతుర్దశి నాడు డొనేషన్ బాక్స్ తెరిచినప్పుడు కేజీ బంగారం, వెండి ఆభరణాలు, రూ .5.48 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. మొదటిసారిగా ఎక్కువ మెుత్తంలో డాలర్లు కూడా కానుకగా వేశారు.' అని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు.


భక్తులకు శ్రీ సన్వాలియా సేథ్ పై చాలా నమ్మకం ఉంది. సుదూర ప్రాంతాల నుండి వస్తారు. తమ కోరికలు నెరవేరితే.. కానుకలు భారీగా ఇస్తారు. సీనియర్ అధికారుల సమక్షంలో కౌంటింగ్ కొనసాగుతుంది. మరో  విషయం ఏంటంటే..  రూ .72.71 లక్షల విలువైన నగదు, మనీ ఆర్డర్‌లు కూడా కానుకగా వచ్చాయి.


గత సంవత్సరం మూడు నెలల లాక్డౌన్ తర్వాత ఆలయాన్ని తెరిచారు. అయినా కేవలం 10 రోజుల్లో రూ. 3 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయని అధికారులు చెప్పారు. ఇక్కడ విదేశీ పర్యాటకుల తాకిడి కూడా ఉంది. ప్రస్తుతం, కరోనావైరస్ కారణంగా, సందర్శకులు చాలా తక్కువ. అయినా.. పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం మరియు వెండి ఆభరణాలు సన్వాలియా సేథ్‌కి కానుకలుగా వస్తున్నాయి.


ఓసారి చతుర్థశి సందర్భంగా అక్కడ ఉత్సవాలు నిర్వహించారు. ఆ తర్వాత హుండీ తెరిచిన అధికారులు ఆశ్చర్యపోయారు. కిక్కిరిసిన హుండీ నుంచి నోట్ల కట్టలు, బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. రూ. 6 కోట్లకు పైగానే ఆదాయం వచ్చినట్లు గుర్తించారు. లెక్కించడానికి రోజులకు రోజులు కూడా పట్టింది. నగదుతో పాటు 91 గ్రాముల బంగారం, దాదాపు 5 కిలోల వెండి వచ్చినట్లు అప్పుడు ఆలయ అధికారులు చెప్పారు.


Also Read: Chocolate Ganesha: ఆ చాకోలెట్ వినాయకుడిని చివరికి ఏం చేస్తారంటే...?