దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా నిన్న 12,08,247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 27,254 మందికి కోవిడ్ వైరస్ పాజిటివ్‌ వచ్చింది. ముందు రోజుతో పోల్చితే కేసులు 4.6 శాతం తగ్గాయి. ఈ నెలలో మరణాల సంఖ్య మరోసారి 200కు తగ్గింది. గడిచిన 24 గంటల్లో 219 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3.32 కోట్ల మంది వైరస్‌ బారిన పడ్డారు. 4.42 లక్షల మంది మరణించారు. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలు విడుదల చేసింది.






 


Also Read: TDP Fight : టీడీపీ వర్సెస్ టీడీపీ ! నేతల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రతిపక్షానికి అసలు సమస్యా..!?


వేగంగా వ్యాక్సినేషన్


ఆదివారం 37,687 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.24 కోట్ల మందికి పైగా వైరస్‌ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 3,74,269 మంది కోవిడ్ తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.13 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.54 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 53,38,945 మందికి కోవిడ్ టీకా వేశారు. ఇప్పటి వరకు 74,38,37,643 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.


ప్రపంచంలో... 


ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 3,73,216 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ ధాటికి మరో 5,913 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 46,43,667కు చేరుకుంది. మరణాల సంఖ్య 46,43,667కు పెరిగింది.


Also Read: Tollywood Drug Case: నవదీప్‌ను విచారిస్తున్న ఈడీ.. ఎఫ్-క్లబ్‌ కేంద్రంగా డ్రగ్స్ లావాదేవీలు?


Also Read: Telangana Govt: ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి అనుమతించండి.. తీర్పులోని ఆ నాలుగు అంశాలను తొలగించండి


Also Read: Ram Charan New Car: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..


Also Read: Old Note: అబ్బా లక్కీ ఛాన్స్.. ఈ పది రూపాయలుంటే రూ.5 లక్షలు మీవే.. ఇక జేబులో వేసుకోవచ్చు